1
00:00:02,000 --> 00:00:07,000
Downloaded from
YTS.MX

2
00:00:08,000 --> 00:00:13,000
Official YIFY movies site:
YTS.MX

3
00:00:21,647 --> 00:00:23,607
ట్రింగ్!

4
00:00:43,836 --> 00:00:44,962
మానసిక సమస్యల సహాయం

5
00:00:45,045 --> 00:00:46,129
డాక్టర్ అందుబాటులో లేరు

6
00:01:32,426 --> 00:01:36,471
రా, శాలీ. నేను ఆలస్యంగా వెళ్తే బాగుండదు.
ఈ ప్రాక్టీసును షెడ్యూల్ చేసిందే నేను,

7
00:01:36,555 --> 00:01:38,390
వచ్చేస్తున్నా, అన్నయ్యా.

8
00:01:44,188 --> 00:01:45,564
బంతి వస్తోంది జాగ్రత్త!

9
00:01:45,647 --> 00:01:47,316
శుభోదయం, చార్లీ బ్రౌన్.

10
00:01:47,399 --> 00:01:50,527
శుభోదయం, లైనస్, లూసీ.
నేటి ప్రాక్టీసుకు మీరు సిద్ధంగా ఉన్నారా?

11
00:01:50,611 --> 00:01:54,114
మనం ప్రాక్టీస్ చేసి ఏం లాభం?
ఎప్పుడైనా ఏ ఆటైనా గెలిచామా?

12
00:01:54,198 --> 00:01:56,658
అందుకే ప్రాక్టీస్ చేయాలి.
ఓడిపోయి ఓడిపోయి నాకు విసుగొచ్చేసింది.

13
00:01:56,742 --> 00:01:58,535
ఒక విషయం అర్థం చేసుకో, చార్లీ బ్రౌన్,

14
00:01:58,619 --> 00:02:01,580
గెలిస్తే మనం నేర్చుకొనే పాఠాల కన్నా
ఓడితేనే మనం ఎక్కువ తెలుసుకుంటాం.

15
00:02:01,663 --> 00:02:04,750
అలా అయితే, ఈపాటికి ప్రపంచంలోనే
నేను అపర మేధావిని అయ్యుండాలి.

16
00:02:04,833 --> 00:02:08,503
నాకు శుభోదయం చెప్పవా, నా బంగారు కొండా?

17
00:02:08,586 --> 00:02:10,839
నేనేమీ నీ బంగారు కొండను కాదు!

18
00:02:10,923 --> 00:02:12,758
మరి ప్లాన్ ఏంటి, చార్లీ బ్రౌన్?

19
00:02:12,841 --> 00:02:15,928
కొత్త యూనిఫామ్స్? కొత్త వ్యూహాలు?
కొత్త క్వార్టర్ బ్యాక్ ప్లేయర్?

20
00:02:16,011 --> 00:02:18,055
అదేం లేదు, కొత్త కోచ్ ని పెట్టుకుందాం.

21
00:02:19,014 --> 00:02:21,558
నువ్వు అనుకున్నంత దద్దమ్మవి కాదులే.

22
00:02:33,278 --> 00:02:35,322
-శుభోదయం, సర్.
-శుభోదయం, మార్సీ.

23
00:02:35,405 --> 00:02:37,115
నేను రగ్బీ గురించి తెలుసుకుంటూ ఉన్నాను, సర్.

24
00:02:37,199 --> 00:02:40,160
బరిలోకి దిగి, ఆ గుండ్రటి బంతిని బ్యాట్ తో
పిచ్చ కొట్టుడు కొట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను.

25
00:02:40,244 --> 00:02:43,580
రగ్బీ గుండ్రటి బంతితో ఆడరు, మార్సీ.
అలాగే ఆ ఆటలో బ్యాట్ కూడా వాడరు.

26
00:02:43,664 --> 00:02:44,915
మీరేం చెప్తే అదే, సర్.

27
00:02:44,998 --> 00:02:47,876
నన్ను "సర్" అని పిలవకు.
ఇవాళ నన్ను "కోచ్" అని పిలువు.

28
00:02:47,960 --> 00:02:49,211
సరే మరి, అందరూ వినండి.

29
00:02:51,755 --> 00:02:57,052
చక్, తర్వాతి సీజన్ కి, తన జట్టును
సంసిద్ధం చేయమని నా సహాయం కోరాడు.

30
00:02:57,135 --> 00:02:59,429
ఇది కదా అసలైన సవాలు అంటే.

31
00:03:00,597 --> 00:03:02,474
ఇక పని మొదలుపెడదామా? మంచిది.

32
00:03:02,558 --> 00:03:05,561
వంద జంపింగ్ జ్యాక్స్ తో
వార్మప్ మొదలుపెట్టండి.

33
00:03:05,644 --> 00:03:06,770
మార్సీ?

34
00:03:06,854 --> 00:03:08,814
విన్నారు కదా. కానివ్వండి!

35
00:03:11,567 --> 00:03:14,027
ఒకటి, రెండు, మూడు,

36
00:03:14,111 --> 00:03:19,783
నాలుగు, అయిదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది.

37
00:03:19,867 --> 00:03:21,910
పదకొండు, 12, 13...

38
00:03:21,994 --> 00:03:25,539
-ఆలస్యమైనందుకు క్షమించు, కోచ్.
-అందుకు కారణం నాకు నచ్చలేదంటే అయిపోతావు, పిగ్పెన్.

39
00:03:28,917 --> 00:03:33,964
ఏంటంటే, రేపు మాతృదినోత్సవం కదా, అందుకని
క్యాండీ స్టోర్ దగ్గర చాలాక్యూ ఉండింది.

40
00:03:35,048 --> 00:03:36,300
ఏంటి?

41
00:03:36,383 --> 00:03:40,012
రేపేనా? మాతృదినోత్సవాన్ని మర్చిపోయానంటే
నాకే నమ్మశక్యంగా లేదు.

42
00:03:40,095 --> 00:03:42,306
మాతృదినోత్సవమా?
మాతృదినోత్సవం చాలా ప్రత్యేకమైనది.

43
00:03:42,389 --> 00:03:43,807
ఇక మాటలు చాలు, చక్.

44
00:03:43,891 --> 00:03:45,267
మార్సీ, ఎన్ని చేశాం?

45
00:03:45,350 --> 00:03:47,561
నేను లెక్క మర్చిపోయాను.

46
00:03:47,644 --> 00:03:49,104
వదిలేయిలే.

47
00:03:49,188 --> 00:03:52,482
మీకు ప్రాక్టికల్ గా చూపిస్తాను.
మీరు ఇప్పుడు రగ్బీలోని

48
00:03:52,566 --> 00:03:56,570
వీరోచిత ఆటను, చండ ప్రచండ సాహసాలను చూస్తారు.

49
00:03:56,653 --> 00:03:57,946
మార్సీ, ప్రవేశపెట్టు.

50
00:04:02,367 --> 00:04:05,078
ఆ గుండ్రటి ముక్కు గల కుక్కని
జాగ్రత్తగా గమనించండి.

51
00:04:05,162 --> 00:04:07,122
ఆ విన్యాసాలను చూడండి.

52
00:04:07,206 --> 00:04:09,166
సరే, కుక్కా. ఇక ఆ విన్యాసాన్ని ఆపేయ్.

53
00:04:12,753 --> 00:04:14,505
ఇక తేలికైన కిక్ తో మొదలుపెడదాం.

54
00:04:14,588 --> 00:04:16,005
సరే మరి, తన్నడానికి సిద్ధంగా ఉండు!

55
00:04:23,764 --> 00:04:25,390
భలే కొట్టావులే, చిట్టి పిట్టా.

56
00:04:25,474 --> 00:04:29,144
దాన్ని మర్చిపో. కిక్ సంగతి వదిలేసి,
పాస్ ఎలా చేసుకోవాలో చూపండి.

57
00:04:30,020 --> 00:04:34,733
మా అమ్మకు ఏదంటే ఇష్టమో నేను తెలుసుకోలేను.
నువ్వు తెలివైన వాడివి, లైనస్. ఏం చేస్తున్నావు?

58
00:04:34,816 --> 00:04:38,487
నా లంచ్ బాస్కెట్ లో ప్రతీరోజు
మా అమ్మ చిన్న చీటీలను పెడుతుంది,

59
00:04:38,570 --> 00:04:39,696
ఇలాంటిదే.

60
00:04:41,823 --> 00:04:43,659
"బాబూ, బాగా చదువు.

61
00:04:43,742 --> 00:04:45,994
నీకు అసలైన ఆనందం కావాలంటే,

62
00:04:46,078 --> 00:04:47,746
అది నీలోనే ఉంటుందని గుర్తుంచుకో.

63
00:04:47,829 --> 00:04:50,415
లంచ్ అనేది బోనస్ మాత్రమే. ప్రేమతో, అమ్మ."

64
00:04:51,375 --> 00:04:53,210
తను అప్పుడప్పుడూ ఎమోషనల్ అయిపోతుందిలే.

65
00:04:53,293 --> 00:04:55,587
ఇప్పుడు నేరుగా వెళ్లి, కుడి వైపుకు తిరుగు.

66
00:04:56,713 --> 00:04:58,632
ఇప్పుడు ఎడమ వైపుకు. ఇక వెనక్కి రా.

67
00:05:03,345 --> 00:05:06,682
వెనక్కి వెళ్లకు. నువ్వు పాస్ చేయాలి, రిటర్న్ కాదు.

68
00:05:06,765 --> 00:05:10,561
అందుకని ఈ ఏడాది, తనకి కృతజ్ఞతలు తెలుపుతూ
ఒక ప్రత్యేకమైన ఉత్తరాన్ని రాయాలనుకుంటున్నాను.

69
00:05:10,644 --> 00:05:13,564
కానీ, ఏం రాయాలి అనేది ఇంకా ఆలోచించలేదు.

70
00:05:13,647 --> 00:05:16,191
రాయడంలో నేను కాస్త వీక్.

71
00:05:16,275 --> 00:05:18,777
"మేడి పండు చూడ... పొట్టవిప్పి చూడ"...

72
00:05:21,071 --> 00:05:24,283
ఇది ఆట కాదు! దాన్ని ట్యాకిల్ చేయ్.

73
00:05:24,366 --> 00:05:26,034
అసలు దానికి నేను చెప్పేదేమైనా వినబడుతోందా?

74
00:05:26,618 --> 00:05:28,412
ఏం చేస్తున్నారు మీరు?

75
00:05:28,495 --> 00:05:32,541
నేను మా అమ్మకు అదిరిపోయే కళాఖండాన్ని
కానుకగా చేస్తున్నాను.

76
00:05:32,624 --> 00:05:34,168
నిజమా? ఏంటి ఆ కానుక?

77
00:05:34,251 --> 00:05:36,044
నాకే తెలిసి ఉంటే, చెప్తా కదా!

78
00:05:36,753 --> 00:05:40,424
-మీ అమ్మకి నువ్వు ఏం ఇస్తున్నావు?
-ఈ మధ్య తను చాలా మంచిగా ఉంటోంది,

79
00:05:40,507 --> 00:05:44,136
కాబట్టి ఈ సారి తనకి
అయిదు డాలర్ల నోటును ఇస్తున్నాను.

80
00:05:44,219 --> 00:05:45,721
ఎంత మంచి ఆలోచన.

81
00:05:45,804 --> 00:05:47,139
నేరుగా పచ్చ నోటే ఇస్తున్నావు.

82
00:05:47,222 --> 00:05:49,474
నీ దగ్గర బంతి లేదు.

83
00:05:50,184 --> 00:05:52,144
మా అమ్మకి నేను ఒక పాటని రాస్తున్నాను.

84
00:05:52,227 --> 00:05:56,148
దాని పేరు "మా మంచి అమ్మ" అని పెట్టాను,
దాన్ని పియానోలో వాయిస్తాను.

85
00:05:56,231 --> 00:05:57,399
మా అమ్మకి కౌగిలింతలు అంటే ఇష్టం,

86
00:05:57,482 --> 00:06:00,110
కాబట్టి ఒక కూపన్ బుక్ నిండా
అవే ఉండేలా చేసి తనకి ఇస్తాను.

87
00:06:00,194 --> 00:06:02,821
ఆగు! వెనుక చూసుకో.

88
00:06:07,409 --> 00:06:11,330
చిట్టి పిట్టవైనా బాగే
ఆడుతున్నావు. పరుగెత్తు! పద, పద!

89
00:06:15,042 --> 00:06:16,919
సూపర్! యాహూ!

90
00:06:17,002 --> 00:06:19,671
కష్టపడ్డావు, కానీ సాధించావు!

91
00:06:19,755 --> 00:06:22,090
అందరూ... గమనించారా?

92
00:06:22,174 --> 00:06:23,759
-మాతృదినోత్సవం.
-మాతృదినోత్సవ శుభాకాంక్షలు.

93
00:06:23,842 --> 00:06:25,135
మాతృదినోత్సవాన్ని మించింది ఏదైనా ఉంటుందా?

94
00:06:25,219 --> 00:06:27,346
-మాతృదినోత్సవ శుభాకాంక్షలు.
-మాతృదినోత్సవం అంటే నాకు చాలా ఇష్టం.

95
00:06:31,558 --> 00:06:33,060
ఒకసారి అందరూ వింటారా?

96
00:06:33,644 --> 00:06:37,064
మీకు ఇప్పుడు పొడిచే పనేమీ లేదు కదా!

97
00:06:38,690 --> 00:06:41,527
నిజానికి, నేను ఆర్ట్ షాపుకు వెళ్లి
ఆర్ట్ సామాను తెచ్చుకోవాలి.

98
00:06:41,610 --> 00:06:43,070
నేను కూపన్స్ చేయాలి.

99
00:06:43,153 --> 00:06:45,781
నేను నా పాటలో చివరి చరణం మీద పని చేయాలి.

100
00:06:45,864 --> 00:06:48,825
నా చాక్లెట్ల బాక్సు కోసం నేను ఒక కార్డ్ కొనాలి.

101
00:06:49,368 --> 00:06:51,203
నేను ఒక ఉత్తరం రాయాలి.

102
00:06:54,373 --> 00:06:57,000
క్షమించు, కోచ్. నేను కూడా వెళ్లాలి.

103
00:06:57,084 --> 00:06:59,628
ఇంకో ప్రాక్టీస్ సెషన్ ని ఏర్పాటు చేయడానికి
నీకు కాల్ చేస్తానులే.

104
00:07:02,130 --> 00:07:04,007
సరే, అందరూ వెళ్లిపోండి.

105
00:07:04,091 --> 00:07:06,760
కానీ వచ్చే సీజన్ ఓడిపోతే,
దానికి కారణం నేనే అని మాత్రం అనకండి.

106
00:07:13,016 --> 00:07:16,228
ఆ చెత్త మాతృదినోత్సవన్ని పట్టించుకోకుండా
కనీసం వీళ్ళైనా ఆడుకుంటున్నారులే.

107
00:07:21,441 --> 00:07:24,152
మీరు కూడానా? నన్ను అందరూ వదిలేసివెళ్లిపోయారు. ఛ.

108
00:07:25,320 --> 00:07:27,531
అందరూ కాదు, కోచ్. సర్.

109
00:09:47,462 --> 00:09:49,256
ఇప్పుడు, ముఖ్యమైన విషయానికి వద్దాం.

110
00:09:49,339 --> 00:09:52,759
నేను వెనక్కి పరుగెత్తుతూ, వెనుక ఉండే వాళ్లకి
పాస్ ఇస్తున్నట్టుగా నటిస్తాను.

111
00:09:52,843 --> 00:09:55,137
కానీ బంతిని నా దగ్గరే ఉంచుకుంటాను,

112
00:09:55,220 --> 00:09:57,973
ప్రత్యర్థి జట్టు వాళ్ల పైఎత్తులను
చిత్తు చేయడానికి అలా చేసి,

113
00:09:58,056 --> 00:10:00,934
పరుగెత్తుతూ టచ్ డవున్ చేస్తాను.

114
00:10:01,018 --> 00:10:02,227
సర్...

115
00:10:03,729 --> 00:10:05,772
ఇదంతా చాలా ఆసక్తికరంగానే ఉంది, సర్,

116
00:10:05,856 --> 00:10:08,692
కానీ ఇతర ఆటగాళ్లు ఇక్కడ ఉన్నప్పుడు
ఇదంతా చేస్తే బాగుంటుందేమో.

117
00:10:08,775 --> 00:10:12,613
మాతృదినోత్సవం వచ్చింది కదా అని
నేను నా ప్లాన్సును మార్చుకోను.

118
00:10:13,447 --> 00:10:16,450
బహుశా మనం సరదాగా ఉండే
ఇంకే పనినైనా చేస్తే మంచిదేమో.

119
00:10:16,533 --> 00:10:18,493
నాకు సరదాగా అనిపించడం లేదని
నేనేమైనా అన్నానా?

120
00:10:18,577 --> 00:10:21,955
సరదాగా లేకపోతే నా ముఖం ఇలా ఉంటుందా?

121
00:10:24,166 --> 00:10:26,668
-మీకు దాని గురించి మాట్లాడాలనుందా, సర్?
-లేదు.

122
00:10:33,217 --> 00:10:36,011
మీకు అమ్మ లేనందుకు
నాకు నిజంగానే బాధగా ఉంది, సర్.

123
00:10:36,094 --> 00:10:39,014
అసలు మాతృదినోత్సవంలో
అంత ప్రత్యేకత ఏముందో నాకు అర్థం కావట్లేదు.

124
00:10:39,097 --> 00:10:41,391
మాతృదినోత్సవం... ఒక పనికిరాని దినోత్సవం!

125
00:10:51,318 --> 00:10:54,988
ఈ విషయం గురించి చర్చించే వీలు
మనకి కలగడం నిజంగా మంచిది, సర్.

126
00:11:10,629 --> 00:11:12,548
నువ్వు ఇంటికి వెళ్లిపో, మార్సీ.

127
00:11:12,631 --> 00:11:15,634
రేపటికి చేయాల్సినవి నీకు కూడా ఏవోకటి ఉంటాయనుకుంటా.

128
00:11:15,717 --> 00:11:19,096
ఇప్పటికే చేసేశాను, సర్. కప్ కేక్స్ చేశాను.

129
00:11:19,179 --> 00:11:21,265
మీతో ఉంటానులే.

130
00:11:23,475 --> 00:11:25,435
ప్రతీ ఏడాదీ ఇలాగే జరుగుతుంది.

131
00:11:25,519 --> 00:11:29,523
నేను ఆనందంగా గడుపుతుంటాను, ఆ తర్వాత
ఎవరోకరు మాతృదినోత్సవం అని అంటారు.

132
00:11:29,606 --> 00:11:33,986
అప్పుడు హఠాత్తుగా, అమ్మ లేని ఏకైక పిల్లని
నేనే అనే విషయం నాకు గుర్తు వచ్చేస్తుంది.

133
00:11:34,653 --> 00:11:36,780
మీకు చాలా కష్టంగానే అనిపిస్తుంటుంది, సర్.

134
00:11:36,864 --> 00:11:38,490
అవును, మార్సీ.

135
00:11:46,957 --> 00:11:48,917
పోయిన ఏడాది, ఆ వారమంతా

136
00:11:49,001 --> 00:11:51,253
స్కూలుకు వెళ్లకుండా ఉండటానికి
నాకు ఆరోగ్యం బాగా లేనట్టు నటించాను.

137
00:11:51,336 --> 00:11:54,673
నాకు గుర్తుంది. మీకు వికారంగా అనిపిస్తున్నట్టు చెప్పారు.

138
00:11:57,885 --> 00:12:00,888
కావాలంటే, మీరు మాతృదినోత్సవం నాడు
మా ఇంట్లో గడపవచ్చు.

139
00:12:00,971 --> 00:12:02,639
మీరు నా గదిలోనే ఉండవచ్చు.

140
00:12:03,307 --> 00:12:06,727
మీ అమ్మ చాలా మంచిది,
కానీ మా అమ్మ లేని లోటును పూడ్చలేదు కదా.

141
00:12:07,227 --> 00:12:09,313
మీకు ఊరటగా అనిపించడానికి
నేను ఏమైనా చేయగలనా?

142
00:12:11,106 --> 00:12:12,357
నాకు తెలీదు, మార్సీ.

143
00:12:12,441 --> 00:12:16,028
అసలు మాతృదినోత్సవం అనేదే లేకుండా చేయగలవా?

144
00:12:16,820 --> 00:12:18,739
నేను అలా చేయలేను, సర్.

145
00:12:19,448 --> 00:12:21,033
అంతేలే.

146
00:12:25,162 --> 00:12:27,122
చక్ రగ్బీ బాల్ ని, అతనికి ఇచ్చేద్దాం పద.

147
00:12:29,416 --> 00:12:32,753
"మా అమ్మకి." వద్దు.

148
00:12:33,295 --> 00:12:36,924
"ప్రియమైన అమ్మకి." వద్దు.

149
00:12:38,383 --> 00:12:40,093
"ఓ నా ప్రియమైన మాతా."

150
00:12:43,305 --> 00:12:44,473
"నమస్తే, అమ్మా."

151
00:12:46,350 --> 00:12:48,227
ఈ రోజుల్లో ఉత్తరాలను ఎవరు రాస్తున్నారులే.

152
00:12:49,853 --> 00:12:50,854
"అమ్మా."

153
00:12:51,355 --> 00:12:53,065
పక్కకి జరుగు, లైనస్.

154
00:12:53,148 --> 00:12:56,443
మాతృదినోత్సవానికి నేను ఒక ప్రత్యేకమైన కానుకను
చేయాలనుకుంటున్నా, అందుకు నాకు ఈ బల్ల కావాలి.

155
00:13:02,074 --> 00:13:05,410
అమ్మని వాటర్ కలర్స్ లో గీయబోతున్నాను.

156
00:13:05,494 --> 00:13:07,996
అమ్మ ఆ బొమ్మని చూశాక,

157
00:13:08,080 --> 00:13:10,707
"ఆ బొమ్మ మ్యూజియమ్ లో ఉండాలి,"
అని అంటుంది.

158
00:13:10,791 --> 00:13:12,501
సూపర్ ఐడియాలా ఉంది.

159
00:13:12,584 --> 00:13:15,254
మంచి కానుకలు కావాలంటే
మనస్సు పెట్టి చేయాలనుకుంటా.

160
00:13:15,337 --> 00:13:18,131
తొక్కేం కాదు. ఇది కళ, బాబూ.

161
00:13:18,632 --> 00:13:24,179
గొప్ప కళాకారిణి కావాలంటే చిత్తశుద్ధి, ఏకాగ్రత,

162
00:13:24,263 --> 00:13:27,349
తొందరపడకుండా ఉండటం వంటి లక్షణాలు ఉండాలి.

163
00:13:27,432 --> 00:13:28,684
అయిపోయింది!

164
00:13:31,103 --> 00:13:33,021
నువ్వు అమ్మని చూసి ఎంత కాలమైంది?

165
00:13:36,191 --> 00:13:40,612
ఇంకేదైనా చేస్తాను. అదిరిపోయేలా ఉండేది.

166
00:13:41,238 --> 00:13:45,117
బాబోయ్. నిజాయితీకి, అతి నిజాయితీకి మధ్య
చాలా సన్నని తేడా ఉంది.

167
00:13:47,870 --> 00:13:49,872
మీరు బెల్ కొట్టరా?

168
00:13:49,955 --> 00:13:51,707
నాకు ఎవరినీ చూడాలని లేదు.

169
00:13:53,667 --> 00:13:55,669
మీకు నా కర్చీఫ్ కావాలా?

170
00:13:56,670 --> 00:13:59,214
నేనేమీ ఏడవట్లేదు, ఆలోచిస్తున్నా.

171
00:13:59,298 --> 00:14:02,426
ఒక్కోసారి ఆ రెండూ ఒకేలా అనిపిస్తాయి.

172
00:14:02,509 --> 00:14:04,678
మీకు కావాలంటే, అడిగి తీసుకోండి.

173
00:14:08,932 --> 00:14:11,101
నేనెందుకు ఇలా దిగాలుపడిపోతానో ఏమో.

174
00:14:11,685 --> 00:14:13,854
బహుశా మీరు మీ అమ్మను మిస్ అవుతున్నారేమో?

175
00:14:13,937 --> 00:14:16,940
నాకు ఊహ తెలిసినప్పటి నుండి నాకు
అసలు అమ్మ ఉంటే కదా, మిస్ అవ్వడానికి!

176
00:14:17,608 --> 00:14:19,943
బహుశా మీరు తల్లులు చేసే పనులను
మిస్ అవుతున్నారేమో,

177
00:14:20,027 --> 00:14:22,070
అంటే, మీకు ఇష్టమైన కుకీలను చేసి పెట్టడం,

178
00:14:22,154 --> 00:14:24,656
మీ చేయి కోసుకుంటే, కట్టు కట్టడం,

179
00:14:24,740 --> 00:14:26,200
మీకు ఇష్టమైన పాటను పాడటం వంటివి.

180
00:14:26,283 --> 00:14:27,618
నేను వాటిని మిస్ అవ్వట్లేదు.

181
00:14:27,701 --> 00:14:31,747
మా అమ్మ చేసే పనులను మా నాన్న చేసి
పెడుతున్నాడు. నాకు ఆయన చాలు.

182
00:14:32,748 --> 00:14:34,499
మీ నాన్న చాలా మంచివారు.

183
00:14:35,375 --> 00:14:37,461
మీరు బాగానే ఉన్నారా, సర్?

184
00:14:38,003 --> 00:14:41,256
మార్సీ, అమ్మలంటే చాలా రకాలుగా ఉంటారు కదా?

185
00:14:41,798 --> 00:14:44,593
అవును. తాత్కాలికంగా పిల్లలను పెంచుకొనే
తల్లులు ఆ పిల్లలను చాలా దారుణంగా చూస్తారు,

186
00:14:44,676 --> 00:14:48,180
దత్తత తీసుకోబడిన పిల్లల విషయంలో కూడా అంతే.
కొందరు పిల్లలకు అయుతే ఇద్దరు తల్లులు ఉంటారు కూడా.

187
00:14:48,263 --> 00:14:53,560
అవును. నా లాంటి తల్లి లేని పిల్లలకి కూడా
తల్లిలాంటి వారు ఒకరు ఉంటే చాలు కదా.

188
00:14:54,144 --> 00:14:57,898
వాళ్ళని దృష్టిలో ఉంచుకొని కూడా
ఈ దినోత్సవాన్ని జరుపుకోవచ్చు కదా?

189
00:14:57,981 --> 00:14:59,233
జరుపుకోవచ్చు.

190
00:14:59,733 --> 00:15:01,610
అయితే, నేను అదే చేస్తాను.

191
00:15:01,693 --> 00:15:04,738
మా నాన్నను దృష్టిలో ఉంచుకొని
నేను మాతృదినోత్సవాన్ని జరుపుకుంటాను.

192
00:15:04,821 --> 00:15:06,198
అంతే, చాలా తేలిక.

193
00:15:06,281 --> 00:15:09,826
మా నాన్నకు నేను మాతృదినోత్సవం
సందర్భంగా కానుకలను ఇస్తే సరిపోతుంది.

194
00:15:11,787 --> 00:15:12,996
కార్డ్ లాంటిదా?

195
00:15:13,080 --> 00:15:15,707
అవును, అంతే! కార్డ్!

196
00:15:15,791 --> 00:15:20,128
నేను ఆయనకి కార్డ్ ఇస్తాను. అంతే! ఇక ఆరోగ్యం బాగాలేదని
నటించాల్సిన అవసరం లేదు. సమస్య పరిష్కారం అయిపోయిందిగా.

197
00:15:20,212 --> 00:15:22,589
మార్సీ, నీ తెలివికి జోహార్లు!

198
00:15:23,090 --> 00:15:24,091
నా తెలివికా?

199
00:15:30,138 --> 00:15:33,016
రేపే మాతృదినోత్సవం అంటే నమ్మలేకపోతున్నాను.

200
00:15:33,100 --> 00:15:35,644
పోయిన ఏడాది కూడా మాతృదినోత్సవం జరిగింది కదా?

201
00:15:35,727 --> 00:15:37,354
అది ప్రతీ ఏడాదీ వస్తుంది.

202
00:15:37,437 --> 00:15:40,983
కానీ ఏకాగ్రతగా ఆలోచించు, శాలీ.
మనం ఒక ప్రత్యేకమైన కానుక చేయాలి.

203
00:15:56,957 --> 00:15:59,084
శాలీ, నాకో ఐడియా తట్టింది.

204
00:15:59,168 --> 00:16:01,587
అమ్మ తనకు ఒక వంటకం అంటే ఇష్టమని
ఎప్పుడూ చెప్తుంటుంది కదా, ఏంటది?

205
00:16:01,670 --> 00:16:03,505
తను వంట చేయాల్సిన అవసరం లేనిది.

206
00:16:03,589 --> 00:16:04,631
అవును.

207
00:16:04,715 --> 00:16:08,468
అయితే, రేపు అమ్మ లేచి, బెడ్ మీద ఉండగానే
మనం తనకి టిఫిన్ చేసి ఇద్దాం.

208
00:16:08,552 --> 00:16:10,596
బెడ్ మీద చేస్తే, దుప్పట్లు నాశనమైపోతాయి కదా?

209
00:16:10,679 --> 00:16:15,184
నీకు నేను చెప్పింది అర్థమైనట్టు లేదు.

210
00:16:15,267 --> 00:16:18,395
దాన్ని మనం ఒక ట్రేలో తీసుకొని వెళ్లి ఇస్తాం,
చాలా బాగా ఉంటుంది.

211
00:16:18,478 --> 00:16:20,105
నాకు మాత్రం అది
అంత మంచి ఐడియాలా అనిపించట్లేదు.

212
00:16:20,189 --> 00:16:22,524
నేను చెప్తున్నా కదా, తనకి అది చాలా బాగా నచ్చుతుంది.

213
00:16:22,608 --> 00:16:24,693
కానీ ముందు మనం మన ప్లాన్ ని టెస్ట్ చేసి చూడాలి.

214
00:16:24,776 --> 00:16:27,446
చైనా క్యాబినెట్ లో ఉన్న
ఆ స్పెషల్ ప్లేట్స్ ని తీసుకురా.

215
00:16:27,529 --> 00:16:29,239
అలాగే, అన్నయ్యా

216
00:16:39,666 --> 00:16:41,418
పిండి

217
00:17:05,776 --> 00:17:07,194
ఏంటి...

218
00:17:14,159 --> 00:17:17,496
బెడ్ మీద ఉండగా టిఫిన్ చేసి ఇవ్వడం
దారుణమైన ప్లాన్ కాదని అన్నావే, మరి ఇదేంటో!

219
00:17:19,665 --> 00:17:21,165
ఓరి దేవుడా.

220
00:20:15,632 --> 00:20:17,885
మనం వచ్చేశాం. సరే మరి.

221
00:20:17,968 --> 00:20:20,220
మనం మాతృదినోత్సవానికి చెందిన కార్డు కోసం వెతకాలి,

222
00:20:20,304 --> 00:20:23,015
కానీ అందులో "నాకు అమ్మ లేని లోటును
తీర్చినందుకు థ్యాంక్స్, నాన్నా," అని ఉండాలి.

223
00:20:23,098 --> 00:20:25,601
అది... లాజిక్ గా అనిపిస్తోంది.

224
00:20:26,560 --> 00:20:30,355
"ప్రియమైన అమ్మ, నీ నవ్వు చూస్తే చాలు,
నా బాధలన్నీ మటుమాయమైపోతాయి." వద్దు.

225
00:20:30,439 --> 00:20:32,941
"ప్రియమైన అమ్మ, నీపై నాకున్న ప్రేమ"...

226
00:20:33,984 --> 00:20:37,404
"ప్రేమకు ప్రతిరూపమైన మా అమ్మకు."
ఇది కూడా వద్దు.

227
00:20:37,487 --> 00:20:39,698
నాన్నకు నచ్చే మాతృదినోత్సవ కార్డులేవి?

228
00:20:39,781 --> 00:20:43,452
ట్రక్కులు కానీ లేదా క్రీడలు కానీ
లేదా కాస్త గుడ్డయినా కానీ, ఏవి?

229
00:20:43,535 --> 00:20:45,996
అన్నీ పూల బొమ్మలతో, సెంటిమెంటల్ గా ఉన్నాయి.

230
00:20:46,079 --> 00:20:48,624
"అమ్మా, ప్రియమైన అమ్మా!" అయ్య బాబోయ్.

231
00:20:48,707 --> 00:20:50,375
వద్దు, అస్సలు వద్దు.

232
00:20:55,714 --> 00:20:58,926
అయ్య బాబోయ్! నాన్న కోసం ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు,

233
00:20:59,009 --> 00:21:00,594
"ఈ లోకంలోనే అత్యుత్తమ బామ్మకి

234
00:21:00,677 --> 00:21:03,764
మాతృదినోత్సవ శుభాకంక్షలు," అని
ఉండే కార్డు నీకేమైనా కనిపించిందా?

235
00:21:03,847 --> 00:21:07,226
మా బామ్మలాగానే ఉండే చిట్టి, పొట్టి కార్డు కావాలి.

236
00:21:08,018 --> 00:21:09,228
అలాంటివి లేవు.

237
00:21:11,688 --> 00:21:14,525
"మా బామ్మలాంటి వ్యక్తి ఇంకెవరూ లేరు.

238
00:21:14,608 --> 00:21:17,861
ఈ లోకంలోనే అత్యుత్తమ బామ్మకి
మాతృదినోత్సవ శుభాకంక్షలు."

239
00:21:17,945 --> 00:21:19,696
ఇది చాలా బాగుంది.

240
00:21:19,780 --> 00:21:22,407
థ్యాంక్యూ. మార్సీ.

241
00:21:24,493 --> 00:21:25,827
హలో.

242
00:21:25,911 --> 00:21:29,665
మా నాన్నకు మాతృదినోత్సవ కార్డు
ఎక్కడ ఉందో చెప్పగలరా?

243
00:21:32,167 --> 00:21:34,753
అలాంటి కార్డులు కూడా మీరు పెట్టుకుంటే మంచిది.

244
00:21:34,837 --> 00:21:38,632
అందరి కుటుంబాలు ఒకేలా ఉండవు కదా. ఓరి నాయనా.

245
00:21:39,341 --> 00:21:40,384
మార్సీ.

246
00:21:41,885 --> 00:21:43,053
క్షమించు.

247
00:21:44,429 --> 00:21:45,430
రా.

248
00:21:46,306 --> 00:21:47,474
నేను మాత్రం పట్టు విడవను.

249
00:21:48,016 --> 00:21:49,017
పద.

250
00:21:50,185 --> 00:21:51,895
ఐస్ స్కేట్స్ తీసుకుంటారా?

251
00:21:51,979 --> 00:21:53,105
అతని చీలమండలాలు బలహీనంగా ఉంటాయి.

252
00:21:53,188 --> 00:21:55,649
-పూలు ఏమైనా తీసుకుంటారా?
-అవంటే ఆయనకి పడదు.

253
00:21:55,732 --> 00:21:56,650
ప్రేమ

254
00:21:56,733 --> 00:21:59,611
-నగలు?
-బాగున్నాయి, కానీ ధర ఎక్కువ కదా.

255
00:21:59,695 --> 00:22:00,696
కేక్ తీసుకుంటారా?

256
00:22:00,779 --> 00:22:03,031
అతనికి ఎక్కువగా స్పైసీవే నచ్చుతాయి.

257
00:22:03,115 --> 00:22:04,408
ఇక్కడికి వచ్చి ట్రీట్ మెంట్ ఇప్పిస్తారా?

258
00:22:04,491 --> 00:22:05,951
ఆయనకి కీర దోసకాయ అంటే అస్సలు పడదు.

259
00:22:10,205 --> 00:22:11,582
ఆయనపై పాట ఏమైనా రాస్తారా?

260
00:22:11,665 --> 00:22:15,586
ఇక నా వల్ల కాదు. ఇది సాధ్యమయ్యే పనిలా లేదు.

261
00:24:49,448 --> 00:24:52,826
వంట గదిని శుభ్రపరచడం అనేది
కానుక కిందికే వస్తుంది అంటావా?

262
00:24:52,910 --> 00:24:55,787
సమయం మించిపోతోంది. ముందు వెతకడం కొనసాగిద్దాం.

263
00:24:58,582 --> 00:25:00,375
ఐస్ క్రీమ్ కేక్ అయితే ఎలా ఉంటుంది?

264
00:25:02,252 --> 00:25:04,713
నిజానికి, అది మంచి ఐడియానే.

265
00:25:10,886 --> 00:25:12,721
ఒక ఐస్ క్రీమ్ కేక్ ఇవ్వరా!

266
00:25:14,681 --> 00:25:16,141
-స్ట్రాబెర్రీ.
-స్ట్రాబెర్రీ.

267
00:25:16,934 --> 00:25:18,185
అది...

268
00:25:18,268 --> 00:25:19,978
-పెద్దది ఇవ్వండి.
-పెద్దది ఇవ్వండి.

269
00:25:24,107 --> 00:25:28,070
శాలీ, నా దగ్గర డబ్బులు కాస్త తక్కువ ఉన్నాయి.
నీ దగ్గర ఏమైనా ఉందా?

270
00:25:30,155 --> 00:25:31,990
ఇందాక వంట గది
శుభ్రం చేయించావు, ఇప్పుడేమో ఇది.

271
00:25:36,787 --> 00:25:39,998
మాతృదినోత్సవం అనేది ఒక స్కామ్, మన చేత డబ్బులు
ఖర్చు పెట్టించడానికని పెట్టిన ఒక దినోత్సవం, అంతే.

272
00:25:41,542 --> 00:25:42,543
థ్యాంక్యూ, సర్.

273
00:25:43,085 --> 00:25:46,797
అయితే, ఈ స్కామ్ లో భాగంగా కొన్నదాన్ని
నువ్వు తినవుగా?

274
00:25:46,880 --> 00:25:48,465
బ్రహ్మాండంగా తింటాను.

275
00:25:48,549 --> 00:25:52,511
ఐస్ క్రీమ్ ఉందంటే, నా సూత్రాలను
అటూఇటూ సర్దుబాటు చేసుకోవచ్చులే.

276
00:26:01,854 --> 00:26:05,732
ఈ అందమైన కిరీటం ఎక్కడిదా
అని ఆశ్చర్యపోతున్నారా?

277
00:26:05,816 --> 00:26:07,276
ఆశ్చర్యపోయాను అనే చెప్పవచ్చు.

278
00:26:07,359 --> 00:26:09,319
మా అమ్మకి రేపు మహారాణిలా అనిపించాలని

279
00:26:09,403 --> 00:26:12,197
తన కోసమే నేను ఇది చేశాను.

280
00:26:12,281 --> 00:26:15,075
నేను దీన్ని పరీక్షిస్తున్నాను, ఇది చాలా బాగుంది.

281
00:26:16,159 --> 00:26:18,287
మా నాన్నకి ఇవ్వడానికి ఏమీ దొరకట్లేదు...

282
00:26:20,914 --> 00:26:24,877
మాతృదినోత్సవం, మాతృదినోత్సవం...
ఎక్కడికి వెళ్లినా అదే మార్మోగుతోంది.

283
00:26:24,960 --> 00:26:29,965
ఇంకోసారి "మాతృదినోత్సవం" అని వినిపిస్తే,
నేను... నేను గట్టిగా అరుస్తాను.

284
00:26:30,048 --> 00:26:32,301
మాతృదినోత్సవం కోసం మా అమ్మకు
మేము ఐస్ క్రీమ్ కేకును కొన్నాం.

285
00:26:32,384 --> 00:26:36,471
మాతృదినోత్సవం కోసం తనకు వెన్నెల కేకును కానీ
ఐస్ క్రీమ్ కేకును కానీ తీసుకుందామంకున్నా.

286
00:26:37,639 --> 00:26:39,766
కానీ శాలీ, స్ట్రాబెర్రీ తీసుకుందాం అంది.

287
00:26:39,850 --> 00:26:42,686
మాతృదినోత్సవం కోసం అది
చాలా మంచి ఫ్లేవర్ లా అనిపించింది.

288
00:26:42,769 --> 00:26:47,107
మాతృదినోత్సవం. మాతృదినోత్సవం

289
00:27:05,959 --> 00:27:08,504
నా కిరీటం నాశనమైపోయింది! ఏం చేశావో చూడు!

290
00:27:10,547 --> 00:27:12,883
క్షమించు, లూసిల్.

291
00:27:12,966 --> 00:27:15,427
చక్. ఏంటంటే...

292
00:27:17,262 --> 00:27:18,430
ఇప్పుడు వివరించే సమయం లేదు.

293
00:27:19,598 --> 00:27:21,016
సర్, ఆగండి.

294
00:27:21,517 --> 00:27:24,728
మాతృదినోత్సవం అంటే
తనకి ఇష్టం ఉన్నట్టుగా అనిపించట్లేదు.

295
00:27:30,234 --> 00:27:32,861
-సర్? ఎక్కడికి వెళ్తున్నారు?
-ఇంటికి.

296
00:27:36,490 --> 00:27:40,702
మా నాన్నకి మాతృదినోత్సవానికని ఒక కానుక
తీసుకుందాముకున్నా, అంతే. కానీ అది కుదరలేదు.

297
00:27:40,786 --> 00:27:42,412
-బహుశా మనం...
-లేదు, మార్సీ.

298
00:27:42,496 --> 00:27:44,915
నువ్వేం చెప్పాలనుకున్నా, దాన్ని వినే మూడ్ నాకు లేదు

299
00:27:44,998 --> 00:27:47,960
నువ్వు సాయపడాలని చూసిన ప్రతీసారి,
నా పరిస్థితి ఇంకా దిగజారిపోతోంది.

300
00:27:48,043 --> 00:27:51,547
నన్ను మన్నించండి, సర్.
అలా నేను కావాలని చేయలేదు.

301
00:27:51,630 --> 00:27:55,592
మాతృదినోత్సవం అంటే నాకు మొదట్నుంచీ
ఇష్టం లేదు, అది ఏం చేసినా మారదు కూడా.

302
00:27:55,676 --> 00:27:58,136
కాబట్టి దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయ్.

303
00:30:15,899 --> 00:30:18,735
చీమలకు మాతృదినోత్సవాన్ని జరుపుకోవలసిన
అవసరం లేదు అనుకుంటా.

304
00:30:20,988 --> 00:30:22,823
అదృష్టజీవులు.

305
00:30:23,365 --> 00:30:25,284
చీమలు ఎంతైనా అదృష్ట జీవులు అనుకుంటా.

306
00:30:25,784 --> 00:30:28,287
వాటికి ఎక్కడ ఉంటే బాగుంటుందో,
వాటికి బాగా తెలుసు అనుకుంటా.

307
00:30:30,122 --> 00:30:33,417
అప్పుడప్పుడూ, మా నాన్న నాతో అంటూ ఉండేవాడు,

308
00:30:33,500 --> 00:30:36,336
"పెప్పెర్మింట్ ప్యాటీ, నువ్వు ఎవరో నీకు తెలుసా?"

309
00:30:36,420 --> 00:30:38,088
నేను ఎప్పుడూ తెలీదు అనే అనేదాన్ని.

310
00:30:38,172 --> 00:30:44,428
అప్పుడు ఆయన, "నువ్వు ఆణిముత్యానివి," అనేవాడు.
ఆ తర్వాత మేము ఇద్దరమూ నవ్వుకొనే వాళ్లం.

311
00:30:44,511 --> 00:30:47,931
కానీ అప్పుడప్పుడూ నేను ఆ ఆణిముత్యాన్ని
కాకపోతే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది.

312
00:30:48,432 --> 00:30:49,933
నాకు అర్థమైంది అనుకుంటా.

313
00:30:50,475 --> 00:30:54,605
ఇవాళ అందరూ చాలా ఆనందంగా ఉన్నారు.
ఆనందం అనేది చిన్న పదం అని అనవచ్చు.

314
00:30:54,688 --> 00:30:58,025
తమ తల్లులకు ఏమైనా చేద్దాం అనే
ఆనందం వాళ్ల కళ్లల్లో కనిపించింది.

315
00:30:58,108 --> 00:31:03,488
నేనేం చేసినా కానీ, ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో
నాకు ఎప్పటికీ తెలీదు అనే విషయం నాకు తెలుసు.

316
00:31:03,572 --> 00:31:05,073
నాకు చాలా కోపం వచ్చింది.

317
00:31:05,657 --> 00:31:09,661
మీ కోపం నిజంగా కోపం కాదని, అది బాధ అని
మీకు ఎప్పుడైనా అనిపించిందా?

318
00:31:21,006 --> 00:31:22,633
ఏడవడం తప్పు కాదు, సర్.

319
00:31:25,969 --> 00:31:27,763
ఒక కన్నీటి బొట్టు కారినంత మాత్రాన
నేను ఏడ్చినట్టు కాదు.

320
00:31:33,810 --> 00:31:36,480
మీ నాన్నగారికి మీరు ఇంకేదైనా ఇవ్వవచ్చేమో.

321
00:31:37,064 --> 00:31:38,607
మళ్లీ ఐడియాలు ఇవ్వడం మొదలుపెట్టకు.

322
00:31:38,690 --> 00:31:41,777
నేను ఆలోచించాను, సర్,
మనం మామూలు విషయాలనే ఆలోచించాం.

323
00:31:41,860 --> 00:31:42,861
కానీ మీరు ఆణిముత్యం.

324
00:31:42,945 --> 00:31:46,657
మీ నాన్నగారికి స్వయంగా మీరు మాత్రమే
చేసి ఇవ్వగల కానుక ఏమైనా ఉందా?

325
00:31:46,740 --> 00:31:48,325
ఏమో మరి.

326
00:31:48,408 --> 00:31:52,120
మీరిద్దరూ కలిసి ఇష్టంగా చేసే పనులు ఏంటి?

327
00:31:53,705 --> 00:31:54,957
అన్నీ.

328
00:31:55,040 --> 00:31:59,211
మేము బేస్ బాల్ ఆడతాం.
రగ్బీ గురించి అంతా నాకు నేర్పింది ఆయనే.

329
00:31:59,294 --> 00:32:04,466
మేము ఇద్దరం కుళ్లు జోకులు చెప్పుకొనే వాళ్లం.
అవి ఎంత చండాలంగా ఉంటే, అంత ఎక్కువ నవ్వేవాళ్లం.

330
00:32:04,967 --> 00:32:08,720
నా నవ్వు ఆయనకి చాలా ఇష్టం.
నా నవ్వు మా అమ్మని గుర్తు తెప్పిస్తుందట.

331
00:32:11,807 --> 00:32:13,851
మాతృదినోత్సవాన్ని ఎలా జరుపుకోవాలో నాకు తెలిసింది.

332
00:32:13,934 --> 00:32:16,603
రేపు నేను రోజంతా మా నాన్నతోనే గడుపుతాను.

333
00:32:16,687 --> 00:32:20,649
మేమిద్దరం ఆడుకుంటాం, ముచ్చట్లాడుకుంటాం,
ఆయన్ని నేను నవ్విస్తాను.

334
00:32:20,732 --> 00:32:22,192
ఆయన నన్ను నవ్విస్తాడు.

335
00:32:22,276 --> 00:32:25,404
మేమిద్దరమూ కలిసి చాలా బిగ్గరగా నవ్వుతాం.

336
00:32:25,487 --> 00:32:29,408
ఏ తండ్రికి అయినా ఇంత కన్నా
పెద్ద మాతృదినోత్సవపు కానుక దక్కదేమో.

337
00:32:29,491 --> 00:32:32,286
అవును! నిజమే! నేను వెళ్తా మరి!

338
00:32:33,954 --> 00:32:39,251
మార్సీ, నీ మనస్సు నొప్పించేలా ఇందాక
నేనేమైనా అని ఉంటే, నన్ను క్షమించు.

339
00:32:39,334 --> 00:32:42,004
-అసలైన స్నేహితురాలివికి అర్థం నువ్వు.
-మీరు కూడా, సర్.

340
00:32:45,090 --> 00:32:47,801
ఇంకా మీ అమ్మగారిని నా తరఫున
మాతృదినోత్సవ శుభాకాంక్షలు చెప్పు!

341
00:32:49,178 --> 00:32:50,387
తప్పకుండా, సర్.

342
00:32:55,100 --> 00:32:57,269
అమ్మకు

343
00:32:58,520 --> 00:33:01,732
ఇది బాగుంది. కానీ మ్యూజియమ్ లో
పెట్టేంత బాగుందా?

344
00:33:11,241 --> 00:33:13,744
తప్పకుండా దీన్ని మ్యూజియమ్ లో పెట్టవచ్చు.

345
00:33:13,827 --> 00:33:15,871
హమ్మయ్య.

346
00:33:15,954 --> 00:33:18,624
ఒక్క క్షణం పాటు నా మీద నాకే అనుమానం వచ్చింది.

347
00:33:18,707 --> 00:33:22,252
-కానీ ఇందులో ఏదో వెలితిగా అనిపిస్తోంది.
-ఏంటి? ఇప్పుడే అన్నావు కదా...

348
00:33:22,336 --> 00:33:25,047
ఏ కార్డ్ అయినా, అందులో ఒక సందేశం
తప్పనిసరిగా ఉండాలి. అది నియమం.

349
00:33:26,590 --> 00:33:29,551
సరే, మేధావి. నీ లేఖలో ఏముంది?

350
00:33:30,344 --> 00:33:31,345
ఇదుగో.

351
00:33:37,309 --> 00:33:42,940
లైనస్. ఇందులో... నా మనస్సులో
ఏదైతే ఉందో, అదే ఇందులో ఉంది.

352
00:33:43,774 --> 00:33:47,611
నా లేఖ ఎందులోనైనా పెడ్తే బాగుంటుంది.

353
00:33:47,694 --> 00:33:50,197
నీకు అభ్యంతరం లేకపోతే,
దీన్ని నీ కార్డులో పెట్టి,

354
00:33:50,280 --> 00:33:52,282
ఇద్దరం కలిసి దాన్ని అమ్మకి ఇద్దాం.

355
00:33:52,366 --> 00:33:53,867
అది నీకు ఓకేనా?

356
00:33:55,369 --> 00:33:58,288
కానీ దీనిలో ఒకటి మార్చాలి.

357
00:34:04,711 --> 00:34:07,381
"ప్రియమైన అమ్మకు, నా స్కూల్ లంచ్ బాస్కెట్ లో

358
00:34:07,464 --> 00:34:09,675
నువ్వు చీటీలు పెట్టేదానివి, అందుకు
కృతజ్ఞతలు చెప్తూ ఈ లేఖ రాస్తున్నాను.

359
00:34:09,757 --> 00:34:14,721
అంతే గాక, స్కూల్ లంచ్ కి టూనా చేపలని
కాకుండా చికెన్ శ్యాండ్ విచ్ లను పెట్టేదానివి కదా,

360
00:34:14,804 --> 00:34:16,639
అందుకు కృతజ్ఞతగా కూడా ఇది రాస్తున్నాను."

361
00:34:17,599 --> 00:34:21,436
"నువ్వు నాకోసం చేసే పనులన్నింటికీ
ఈ విధంగా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

362
00:34:22,062 --> 00:34:25,482
నాకు భయం వేసినప్పుడు, నన్ను
కౌగిలించుకొని, నన్ను గారాబం చేస్తావు.

363
00:34:27,650 --> 00:34:30,654
నాకు ఒంటరిగా అనిపించినప్పుడు,
నాకు ఆప్త నేస్తంగా ఉంటావు.

364
00:34:30,737 --> 00:34:31,947
నాకు అది చాలా ఇష్టం.

365
00:34:34,408 --> 00:34:37,494
నా కొత్త ఐడియాలను వినడానికి
నీకు ఎప్పుడూ తీరిక ఉంటుంది."

366
00:34:40,914 --> 00:34:41,956
కౌగిలింతలు

367
00:34:42,040 --> 00:34:45,168
"నా మిత్రుల ముందు కూడా
నువ్వు నన్ను హత్తుకొని ముద్దులిస్తావు,

368
00:34:45,252 --> 00:34:48,505
అది ఇబ్బందిగా అనిపించినా,
నాకు అవంటే చాలా ఇష్టం.

369
00:34:49,547 --> 00:34:53,969
నేను ఏ తప్పైనా చేస్తే, మళ్లీ మళ్లీ
ప్రయత్నించమని నన్ను ప్రోత్సహిస్తావు.

370
00:35:00,434 --> 00:35:02,561
ప్రతీరోజు రాత్రి నేను క్షేమంగా ఉన్నానని
నిర్దారించుకుంటావు.

371
00:35:03,645 --> 00:35:06,648
నీ ప్రత్యేకమైన రీతిలో
నీకు చేతనైనంతగా నన్ను చూసుకుంటావు."

372
00:35:12,029 --> 00:35:13,322
పట్టుకోవాలంటే దూరంగా వెళ్ళాలి, నాన్నా.

373
00:35:14,573 --> 00:35:15,908
భలే పట్టుకున్నావే.

374
00:35:16,658 --> 00:35:18,452
ఇక ఆ బంతి గురించి మర్చిపో, నాన్నా.

375
00:35:18,535 --> 00:35:21,747
ఇంకో జోక్ చెప్తా విను.
ఏనుగును ఫ్రిడ్జ్ లో ఎలా పెడతావు?

376
00:35:22,331 --> 00:35:23,874
ఫ్రిడ్జ్ తలుపు తెరిచి, ఆ తర్వాత పెడతావు.

377
00:35:24,458 --> 00:35:26,376
"నాకు బాధగా ఉన్నప్పుడు, నవ్వు తెప్పిస్తావు.

378
00:35:26,460 --> 00:35:29,796
ఆ తర్వాత నువ్వు కూడా నవ్వి,
నాకు ఇంకా నవ్వు వచ్చేలా చేస్తావు."

379
00:35:31,924 --> 00:35:36,595
"నన్ను ప్రేమించేదానివి అని, ఏది ఏమైనా
నాకు ఎప్పుడూ అండగా ఉంటావని నాకు తెలుసు.

380
00:35:36,678 --> 00:35:40,516
తల్లులందరూ అదే చేస్తారు అనుకుంటా.
కానీ నువ్వు అందులో టాప్. అందుకే"...

381
00:35:40,599 --> 00:35:42,809
ఇప్పుడు నువ్వు కూడా చెప్పాలి.

382
00:35:42,893 --> 00:35:48,524
మేము కూడా నిన్ను చాలా చాలా ప్రేమిస్తున్నాం.
మాతృదినోత్సవ శుభాకాంక్షలు.

383
00:35:51,944 --> 00:35:54,947
అమ్మకు

384
00:36:34,194 --> 00:36:36,738
చార్ల్స్ ఎం. షుల్జ్ అందించిన పీనట్స్ కామిక్ స్ట్రిప్
ఆధారంగా రూపొందించబడింది

385
00:37:54,608 --> 00:37:57,110
రాబ్ గిబ్స్ జ్ఞాపకార్థం
1964-2020

386
00:37:57,194 --> 00:37:59,196
ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య

387
00:38:02,282 --> 00:38:04,243
థ్యాంక్యూ, స్పార్కీ.
ఎల్లప్పుడూ మా హృదయాల్లోనే ఉంటావు.



