1
00:00:02,000 --> 00:00:07,000
Downloaded from
YTS.MX

2
00:00:08,000 --> 00:00:13,000
Official YIFY movies site:
YTS.MX

3
00:00:15,265 --> 00:00:16,767
మేము వ్యాసం రాాయాలా?

4
00:00:18,810 --> 00:00:21,438
మేము ఎవరు అనే అంశంపై
ఐదు వందల పదాల వ్యాసం రాయాలా?

5
00:00:21,522 --> 00:00:26,068
నేనెవరో నాకే తెలియదు.
ఇక 500 పదాలు ఎలా రాయడం?

6
00:00:26,652 --> 00:00:28,278
ఇది జరిగే పని కాదు.

7
00:00:30,155 --> 00:00:33,116
వారంలో రాసి ఇచ్చేయాలా? దేవుడా.

8
00:00:33,200 --> 00:00:36,787
నేను: ఇలాంటి చెత్త అంశంపై
రాయవలసి రావడం నా ఖర్మ.

9
00:00:37,871 --> 00:00:40,624
నువ్వు మరీ అతిగా
బాధపడుతున్నావు, చార్లీ బ్రౌన్.

10
00:00:42,709 --> 00:00:44,795
పాపం, అమాయకుడైన చార్లీ బ్రౌన్ కి,

11
00:00:44,878 --> 00:00:48,507
ఎన్నడూ అదృష్టం కలసి వచ్చిన దాఖలాలే లేవు.

12
00:00:49,216 --> 00:00:53,220
మీరు అతని గురించి వినే ఉంటారు.
చూసి ఉంటారు కూడా.

13
00:00:54,137 --> 00:00:55,639
అతను అన్నిచోట్లా చోటు దక్కించుకున్నాడు.

14
00:00:56,640 --> 00:01:01,103
న్యూస్ పేపర్లలు, పుస్తకాలు, సినిమాలు,
టీవీల్లోనూ అంతటా.

15
00:01:01,186 --> 00:01:04,565
అతను ప్రపంచమంతా చుట్టాడు,
విమానం కూడా ఎక్కాడు.

16
00:01:05,147 --> 00:01:08,485
-అతను చంద్రమండలానికి కూడా వెళ్లొచ్చాడు.
-దేవుడా, చార్లీ బ్రౌన్.

17
00:01:08,569 --> 00:01:11,864
చూడబోతే, చార్లీ బ్రౌన్,
అతని కుక్క, స్నూపీ,

18
00:01:11,947 --> 00:01:15,868
మిగతా పీనట్స్ గ్యాంగ్ సభ్యులకు మన జీవితంతో
విడదీయలేని బంధం ఉన్నట్టు అనిపిస్తుంది.

19
00:01:16,869 --> 00:01:19,121
లైనస్, నాకు తనంటే ప్రత్యేకమైన అభిమానం.

20
00:01:19,204 --> 00:01:22,499
-నాకు ఇష్టమైన పాత్ర లైనస్.
-నేను వుడ్ స్టాక్ అభిమానిని.

21
00:01:22,583 --> 00:01:24,960
నాకు ఫ్రాంక్లిన్ అంటే ఎంత
అభిమానమో మాటల్లో చెప్పలేను.

22
00:01:25,043 --> 00:01:27,880
పీనట్స్ లో నాకు ఇష్టమైన పాత్ర,
పెప్పర్మింట్ ప్యాటీ.

23
00:01:28,463 --> 00:01:31,383
-అవును, స్నూపీ అంటే ఇష్టం.
-నాకు స్నూపీ అంటేనే ఎక్కువ ఇష్టమనుకోండి.

24
00:01:31,466 --> 00:01:35,512
70 ఏళ్ళుగా, పీనట్స్
మన జీవితాల్లో ఒక భాగమైపోయింది.

25
00:01:35,596 --> 00:01:38,515
పీనట్స్ అంటే, అదొక గ్రహం అనిపిస్తుంది.

26
00:01:38,599 --> 00:01:40,392
ప్రేక్షకులే దాని ప్రపంచం.

27
00:01:40,475 --> 00:01:43,854
దాన్ని ఇష్టపడనివారు ఉండరు, అందుకనే
అదొక అద్భుతమైన విషయంగా మారిపోయింది.

28
00:01:43,937 --> 00:01:47,024
పీనట్స్ విశ్వవ్యాప్తంగా
అందరికీ ఆదర్శం కావచ్చు,

29
00:01:47,107 --> 00:01:51,236
కానీ, దానికి కేంద్ర బిందువుగా
ఉన్నది మాత్రం అమాయకుడైన చార్లీ బ్రౌన్.

30
00:01:51,320 --> 00:01:54,031
నాకు పీనట్స్ అంటే ఇష్టం,
అలాగే చార్లీ బ్రౌన్ కూడా.

31
00:01:54,114 --> 00:01:55,991
నాకు చార్లీ బ్రౌన్ అంటే భలే ఇష్టం.

32
00:01:56,074 --> 00:01:58,535
చార్లీ బ్రౌన్ ను చూస్తుంటే నన్ను నేను
చూసుకున్నట్టుగానే ఉంటుంది.

33
00:01:59,244 --> 00:02:01,663
ఇంతకీ, అసలు ఈ చార్లీ బ్రౌన్ ఎవరు?

34
00:02:01,747 --> 00:02:03,373
అతను ఎక్కడి నుండి వచ్చాడు?

35
00:02:03,457 --> 00:02:07,628
నేనెవరినో ఎవరికి కావాలి?
నా గురించి ఎవరూ పట్టించుకోరు.

36
00:02:15,177 --> 00:02:17,763
"హూ ఆర్ యూ, చార్లీ బ్రౌన్?"

37
00:02:18,931 --> 00:02:22,142
వ్యాఖ్యాత: లుపిటా న్యోంగో.

38
00:02:23,435 --> 00:02:26,772
చార్లీ బ్రౌన్ అనే పిల్లాడు
ఇంకా రూపం సంతరించుకోకముందు,

39
00:02:26,855 --> 00:02:32,110
చార్లెస్ షుల్జ్ అనే వ్యక్తి
ఉండేవాడు. కార్టూనిస్టు కావాలనేది అతని కల.

40
00:02:32,194 --> 00:02:34,655
కామిక్ స్ట్రిప్
రూపొందించాలని నేను కలలు కనేవాణ్ని.

41
00:02:34,738 --> 00:02:38,492
నాకు ఆరేళ్ళ వయసున్నప్పటినుంచీ
అదే కల కనేవాణ్ని.

42
00:02:38,575 --> 00:02:40,786
దాదాపు తను పుట్టినప్పటి నుంచీ,

43
00:02:40,869 --> 00:02:44,331
కామిక్స్ కోసమే చార్లెస్ షుల్జ్
పుట్టాడా అనిపించేది.

44
00:02:44,414 --> 00:02:45,916
తను పసికూనగా ఉన్నప్పుడు...

45
00:02:45,999 --> 00:02:47,000
లిన్ జాన్స్టన్
కార్టూనిస్ట్, "ఫర్ బెటర్ ఆర్ ఫర్ వర్స్"

46
00:02:47,084 --> 00:02:48,377
...అతని అంకుల్స్ లో ఒకరు అతన్ని
స్పార్క్ ప్లగ్ అని పిలిచేవారు,

47
00:02:48,460 --> 00:02:51,755
ఆ పేరు స్పార్క్ ప్లగ్ ది హార్స్ అనే
కామిక్ స్ట్రిప్ పాత్ర నుంచి వచ్చింది.

48
00:02:52,422 --> 00:02:54,883
దాంతో, అందరూ అతన్ని స్పార్కీ
అని పిలవడం మొదలెట్టారు.

49
00:02:54,967 --> 00:02:56,885
అతనొక్కడే సంతానం అన్నమాట,

50
00:02:56,969 --> 00:03:01,181
అతను చిన్నపిల్లాడుగా ఉన్నప్పుడు ఎవ్వరూ
అతనితో పెద్దగా మాట్లాడేవారు కాదు.

51
00:03:01,265 --> 00:03:02,891
అతనికి ఎంత సిగ్గు అంటే...

52
00:03:02,975 --> 00:03:04,184
కారెన్ జాన్సన్ - మాజీ డైరెక్టర్
చార్లెస్ ఎమ్. షుల్జ్ మ్యూజియం

53
00:03:04,268 --> 00:03:06,812
...తను తల్లితో కలసి సెయింట్ పాల్ వీధిలో
నడిచి వెళ్లేటప్పుడు

54
00:03:06,895 --> 00:03:08,063
తల వంచుకునే వెళ్లేవాడు.

55
00:03:08,146 --> 00:03:10,524
ఇంత సిగ్గుపడే స్పార్కీ
స్కూల్లో బాగా చదివేవాడు,

56
00:03:10,607 --> 00:03:11,984
దాంతో పైతరగతికి ప్రమోట్ అయ్యాడు.

57
00:03:12,067 --> 00:03:14,778
కానీ, అది కొత్త కష్టాలను తెచ్చిపెట్టింది.

58
00:03:14,862 --> 00:03:19,324
తరగతి గదిలో అందరికంటే
అతను ఒక సంవత్సరం చిన్నవాడు,

59
00:03:19,408 --> 00:03:21,660
అది చిన్నతనంలో చాలా పెద్ద విషయం కదా.

60
00:03:21,743 --> 00:03:22,744
చిప్ కిడ్
రచయిత/గ్రాఫిక్ డిజైనర్

61
00:03:22,828 --> 00:03:26,957
తనకంటే పెద్దవాళ్లైన పిల్లలతో సమంగా అతను
ముందుకు సాగలేకపోయాడు. కష్టంగా అనిపించింది.

62
00:03:27,040 --> 00:03:30,544
స్కూల్లోని మిగతా పిల్లలు అతడిని అస్సలు
పట్టించుకోవడమే లేదని అతనికి అనిపించింది.

63
00:03:30,627 --> 00:03:31,628
జీన్ షుల్జ్
చార్లెస్ షుల్జ్ సతీమణి

64
00:03:31,712 --> 00:03:35,799
స్కూల్ ముగిశాక, స్పార్కీకి తన
తండ్రి బార్బర్ షాప్ లో గడపడమంటే ఇష్టం.

65
00:03:36,550 --> 00:03:40,220
"ఒంటరితనం నన్ను బాధిస్తే, నేను
మా నాన్న బార్బర్ షాప్ కి వెళ్లేవాణ్ని.

66
00:03:40,721 --> 00:03:43,390
నాకు షేవింగ్ ఏమైనా కావాలా అని
నన్ను ప్రతీసారు అడిగేవాళ్ళు."

67
00:03:44,391 --> 00:03:46,185
కానీ అక్కడా ఇబ్బందులు తప్పలేదు.

68
00:03:46,268 --> 00:03:49,605
నేను షాప్ కి వెెళ్లినప్పుడు,
నాకు తను క్షవరం చేయడం మెదలుపెట్టినప్పుడు,

69
00:03:49,688 --> 00:03:54,026
నన్ను ఇబ్బంది పెట్టే విషయం ఏమంటే,
తను నాకు సగం క్షవరం చేశాక,

70
00:03:54,109 --> 00:03:56,320
ఇంతలో మరో మంచి కస్టమర్ వచ్చేవాడు.

71
00:03:56,403 --> 00:03:59,072
దాంతో తను నన్ను "నువ్వు కాస్త ఆ పక్కన
కూర్చోని కసేపు వేచి ఉండు,

72
00:03:59,156 --> 00:04:02,034
ఈలోగా నేను ఈయనకి క్షవరం చేసి
పంపిస్తాను," అనేవాడు.

73
00:04:02,117 --> 00:04:05,996
సగం క్షవరం చేసిన తలతో
అలా వేచి ఉండటం నాకు భలే ఇబ్బందిగా ఉండేది.

74
00:04:06,079 --> 00:04:08,332
తను మాధ్యమిక పాఠశాలకు వచ్చేసరికి,

75
00:04:08,415 --> 00:04:11,001
చదువులో ముందు ఉండే స్పార్కీ
వెనకబడటం మొదలుపెట్టాడు,

76
00:04:11,084 --> 00:04:13,212
దానితో తను ఎందుకూ పనికిరాడని
అతనికి అనిపించింది.

77
00:04:13,295 --> 00:04:16,339
నేను ఎనిమిదో తరగతి చదివేటప్పుడు
కాబోలు, చదువులో పూర్తిగా వెనకబడ్డాను.

78
00:04:16,423 --> 00:04:18,800
అన్నింట్లోనూ ఫెయిల్ అయ్యాను.

79
00:04:19,301 --> 00:04:21,720
అయితే తన స్కెచ్ బుక్ చూసి,

80
00:04:21,803 --> 00:04:23,347
స్పార్కీ ఎంతో సంబరపడేవాడు.

81
00:04:23,430 --> 00:04:27,392
ఎప్పుడూ బొమ్మలు గీస్తూ ఉండేవాడు, తను రోజూ
చదివే వార్తా పత్రికల్లో కనిపించే

82
00:04:27,476 --> 00:04:29,603
కామిక్స్ వంటివి తాను గీయకపోతానా అని
కలలు కనేవాడు.

83
00:04:29,686 --> 00:04:33,148
సెయింట్ పాల్ లో మేం రోజూ రెండు
పేపర్లు తెప్పించేవాళ్లం, శనివారం రాత్రి,

84
00:04:33,232 --> 00:04:35,817
మా నాన్న స్థానిక మందుల దుకాణానికి వెళ్లి,

85
00:04:35,901 --> 00:04:40,072
రెండు మినియాపొలిస్ పత్రికలు కొనేవాడు, అలా
మాకు 4 కామిక్ సెక్షన్లు చదివే వీలుకలిగేది.

86
00:04:40,864 --> 00:04:43,075
నా వరకూ అదే నా ప్రపంచం.

87
00:04:53,460 --> 00:04:57,714
నేనెవరు అనే అంశంపై ఐదు వందల పదాలు
రాయాలట. నేనెవర్ని, స్నూపీ?

88
00:04:57,798 --> 00:04:59,299
నేనొక బార్బర్ కొడుకుని.

89
00:04:59,800 --> 00:05:04,972
నాకు బేస్ బాల్ అంటే ఇష్టం. స్కూల్ కి
వెళ్తాను. కష్టపడి రోజంతా నెట్టుకొస్తాను.

90
00:05:05,597 --> 00:05:07,808
ఈ వ్యాసం రాయడం చాలా కష్టం.

91
00:05:11,019 --> 00:05:15,065
నీకు అర్థం కాదు, స్నూపీ.
నువ్వు ఏనాడూ కష్టమైన పనులు చేయలేదుగా.

92
00:05:15,566 --> 00:05:18,402
కూర్చోవడం, నిలబడటం, తిరగడం అంతేగా.

93
00:05:19,319 --> 00:05:20,988
కుక్కల జీవితం చాాలా హాయిగా ఉంటుంది.

94
00:06:25,886 --> 00:06:27,888
మార్చ్ మార్చ్
మార్చ్ మార్చ్

95
00:06:28,805 --> 00:06:30,057
మార్చ్ మార్చ్
మార్చ్ మార్చ్

96
00:06:30,140 --> 00:06:32,017
మార్చ్ మార్చ్
మార్చ్ మార్చ్

97
00:06:32,100 --> 00:06:34,978
"స్పార్కీ యుద్దానికి బయల్దేరాడు!"

98
00:06:35,979 --> 00:06:39,983
1942లో, స్పార్కీ సైన్యంలో చేరాడు.

99
00:06:40,734 --> 00:06:43,070
"నువ్వు సైన్యంలో చేరితే ఏమవుతుంది?"

100
00:06:43,153 --> 00:06:45,197
"వాళ్లు నిన్ను ఒక చోటకు పంపిస్తారు."

101
00:06:45,280 --> 00:06:47,282
"నాకు అదంటేనే భయం."

102
00:06:51,995 --> 00:06:55,123
ఇల్లు వదిలి వెళ్లడం
స్పార్కీకి చాలా కష్టంగా అనిపించింది.

103
00:06:55,207 --> 00:06:59,586
తల్లి దగ్గర అతనికి చనువు ఎక్కువ, ఆమె ఏమో
చాలా కాలంగా అనారోగ్యంతో ఉంది.

104
00:07:00,087 --> 00:07:03,590
తన తల్లి ఎంత తీవ్రమైన అనారోగ్యంతో ఉందో,
స్పార్కీకి ఎవ్వరూ చెప్పలేదు.

105
00:07:04,424 --> 00:07:08,804
ఆమె బతికే అవకాశాలు కూడా తక్కువే అని
కూడా తనకి చెప్పలేదు.

106
00:07:09,388 --> 00:07:15,102
అందువల్ల అతను ఎంతో ఒంటరితనంతో బాధపడ్డాడు.

107
00:07:15,686 --> 00:07:18,814
నేను మిన్నెసోటాలోని
పోర్ట్ స్నెల్లింగ్ కు రిపోర్ట్ చేయవలసిన

108
00:07:18,897 --> 00:07:21,650
రోజు రాత్రి, ఆమె నాతో
"బహుశా, మనం ఇప్పుడే గుడ్ బై చెప్పుకోవాలి,

109
00:07:21,733 --> 00:07:25,362
ఎందుకంటే, ఇక మనిద్దరం
మళ్లీ కలుసుకోలేకపోవచ్చు," అని అంది.

110
00:07:25,445 --> 00:07:27,072
ఆ తర్వాత నేను వెళ్లిపోయాను.

111
00:07:27,155 --> 00:07:29,700
తన తల్లి మరణం గురించి మాట్లాడినప్పుడు,

112
00:07:29,783 --> 00:07:31,785
అతను చాలా బాధ పడేవాడు,
దుఃఖంతో అతని గొంతు పెగిలేది కాదు.

113
00:07:31,869 --> 00:07:34,204
తను కళ్లనీళ్ల పర్యంతం అయ్యేవాడు.

114
00:07:34,788 --> 00:07:41,211
ఆ బాధ నుంచి అతను
జీవితంలో ఎన్నడూ కోలుకోలేదు.

115
00:07:42,045 --> 00:07:44,131
" ఇదంతా చాలా విచిత్రంగా ఉంటుంది.

116
00:07:44,631 --> 00:07:48,260
మీరు ఏమీ ఆలోచించకుండా అలా
ఊరికే నడుస్తూ ఉండవచ్చు.

117
00:07:48,760 --> 00:07:51,263
కానీ, అకస్మాత్తుగా మీరేం పోగొట్టుకున్నారో
అది గుర్తుకువస్తే..."

118
00:07:52,139 --> 00:07:53,140
అటెన్షన్!

119
00:07:53,223 --> 00:07:56,268
ఆ రోజులు ఎలా గడిచాయో కూడా నాకు అర్థంకాదు.

120
00:07:56,351 --> 00:07:57,603
చాలా కాలమే గడిచి ఉండవచ్చు,

121
00:07:57,686 --> 00:08:00,647
కానీ, అలాంటి విషయాలను ఏనాడూ మరచిపోలేం.

122
00:08:10,199 --> 00:08:14,203
చిన్నప్పుడు స్పార్కీ ఏనాడూ ఇల్లు
వదిలి ఒక్క రాత్రియినా బయట గడిపినవాడు కాదు.

123
00:08:14,286 --> 00:08:15,537
కానీ యుద్ధ సమయంలో,

124
00:08:15,621 --> 00:08:18,707
అతను ఫ్రాన్సు, జర్మనీ వంటి
దేశాలకు వెళ్లాడు.

125
00:08:19,291 --> 00:08:23,754
తను సైన్యంలో ఉన్నంతకాలం, స్పార్కీ
ఇంటిమీద బెంగతో, ఒంటరితనంతో గడిపేవాడు.

126
00:08:23,837 --> 00:08:27,508
అందువల్ల, తను చిన్నప్పుడు వేసినట్టే,
బొమ్మలు వేస్తూ కాలం వెళ్లబుచ్చేవాడు.

127
00:08:27,591 --> 00:08:29,635
తను ఎక్కడికి వెళ్లినా, స్కెచ్ బుక్ ను
వెంట బెట్టుకుని వెళ్లేవాడు.

128
00:08:29,718 --> 00:08:30,719
"యాజ్ వీ వర్"
రూపకర్త: స్పార్కీ

129
00:08:30,802 --> 00:08:33,804
యుద్ధం ముగిశాక, తను కార్టూనిస్టు కావాలని

130
00:08:33,889 --> 00:08:35,765
మరింత గట్టి సంకల్పంతో స్వదేశానికి వచ్చాడు.

131
00:08:40,604 --> 00:08:43,815
అన్నయ్యా, లెక్కల హోమ్ వర్క్
చేయడంలో నాకు సాయం చేయాలి.

132
00:08:44,316 --> 00:08:46,652
నేను వ్యాసం రాయడంలో బిజీగా
ఉన్నాను, కనిపించట్లేదా?

133
00:08:46,735 --> 00:08:48,195
దేని గురించి వ్యాసం?

134
00:08:48,278 --> 00:08:49,988
నేనెవరు అనే అంశం గురించి.

135
00:08:50,489 --> 00:08:52,950
నువ్వు ఎవరా? నువ్వెవరో నేను చెబుతాను.

136
00:08:53,033 --> 00:08:54,743
నువ్వు నా పెద్దన్నయ్యవి.

137
00:08:54,826 --> 00:08:56,620
లెక్కల హోమ్ వర్క్ లో

138
00:08:56,703 --> 00:08:59,206
నాకు సాయం చేయకపోతే మాత్రం
నాకు చెత్త అన్నయ్యవి.

139
00:08:59,915 --> 00:09:01,917
ఇదిగో, దీన్ని చూడు.

140
00:09:02,876 --> 00:09:04,086
దేవుడా.

141
00:09:04,753 --> 00:09:09,508
సరే. నీ దగ్గర రెండు యాపిల్ పళ్లున్నాయి.
నేను మరో మూడు ఇచ్చాననుకో,

142
00:09:09,591 --> 00:09:11,426
అప్పుడు నీ దగ్గర ఎన్ని ఉంటాయి?

143
00:09:12,594 --> 00:09:13,595
ఎన్ని ఉంటే ఎవరికి ఎక్కువ?

144
00:09:13,679 --> 00:09:16,473
నేను ఒకసారికి ఒక యాపిల్ కంటే
ఎక్కువ ఎప్పుడైనా తిన్నానా.

145
00:09:16,557 --> 00:09:19,184
అయినా, ఇన్ని యాపిల్స్ ఎవరు ఇస్తారు?

146
00:09:20,394 --> 00:09:22,855
ఇక నేను వ్యాసం రాసినట్టే.

147
00:09:27,734 --> 00:09:31,488
అన్నింటికీ మించి, స్పార్కీ
కార్టూనిస్టు కావాలనుకున్నాడు.

148
00:09:32,364 --> 00:09:35,075
అందుకోసం, చార్లీ బ్రౌన్ లాగ,
అతను ప్రయత్నం ఆపకుండా కొనసాగించేవాడు.

149
00:09:35,576 --> 00:09:39,037
అలాగే చార్లీ బ్రౌన్ లాగానే,
విఫలమయ్యేవాడు కూడా.

150
00:09:40,038 --> 00:09:43,500
"ద సాటర్డే ఈవినింగ్ పోస్ట్"కి
నేను పది కార్టూన్లు పంపేవాణ్ని.

151
00:09:43,584 --> 00:09:46,295
వాటిని ప్రచురించేలోగా, నేను
ఒక కామిక్ స్ట్రిప్ మీద పని చేసేవాడిని.

152
00:09:46,378 --> 00:09:49,798
ఆ కామిక్ స్ట్రిప్ ను పంపించి,
మరో పనిలో మునిగిపోయేవాణ్ని.

153
00:09:49,882 --> 00:09:53,093
స్పార్కీ గీసిన కొన్ని కార్టూన్లు
ప్రచురణకు నోచుకున్నాయి,

154
00:09:53,177 --> 00:09:56,263
కానీ అప్పటికి వాటిలో చార్లీ బ్రౌన్ కానీ,
స్నూపీ కానీ ఉండేవి కాదు.

155
00:09:56,346 --> 00:09:59,099
ఒకసారి నీ మొదటి కార్టూన్ ప్రచురణ అయ్యాక,

156
00:09:59,183 --> 00:10:02,102
ఇక మనకు అడ్డే లేదు, అంతా సవ్యంగానే
సాగుతుందని అనుకుంటాం, కానీ అలా జరగదు.

157
00:10:02,186 --> 00:10:05,606
రెండు, మూడు కార్టూన్లను విక్రయించగలిగాను,
తర్వాత నెలల తరబడి ఎవరూ కొనేవారు కాదు.

158
00:10:05,689 --> 00:10:09,318
ఐదేళ్లపాటు స్పార్కీ
ప్రయత్నాలు విఫలమవుతూనే వచ్చాయి.

159
00:10:09,401 --> 00:10:12,112
అప్పుడే అతను ఓ విషయం గ్రహించాడు.

160
00:10:12,196 --> 00:10:15,073
తను "లిటిల్ ఫోక్స్" పేరిట
ఒక కామిక్ స్ట్రిప్ గీశాడు,

161
00:10:15,574 --> 00:10:17,784
అందులో చార్లీ బ్రౌన్ అనే పాత్రను
ప్రవేశపెట్టాడు...

162
00:10:17,868 --> 00:10:18,869
కెవిన్ స్మిత్
సినీ నిర్మాత

163
00:10:18,952 --> 00:10:22,456
...అలాగే అచ్చం స్నూపీ కాకపోయినా, అలాంటి
పోలికలున్న ఓ కుక్కకూ స్థానం కల్పించాడు.

164
00:10:23,415 --> 00:10:27,127
పిల్లల బొమ్మలు గీస్తుంటే,
సంపాదకులకు ఇలాంటి బొమ్మలే

165
00:10:27,211 --> 00:10:31,632
నచ్చుతాయన్న విషయం నెమ్మది నెమ్మదిగా
నాకు బోధపడసాగింది.

166
00:10:31,715 --> 00:10:34,176
చివరకు అతని కృషికి సత్ఫలితాలు అందసాగాయి.

167
00:10:34,259 --> 00:10:36,637
1950లో ఒక రోజు,

168
00:10:36,720 --> 00:10:39,389
స్పార్కీ "పీనట్స్" పేరిట తన
తొలి కామిక్ స్ట్రిప్ ను ప్రచురించాడు.

169
00:10:39,473 --> 00:10:40,474
ఈ రోజు నుండే ఆరంభం
పీనట్స్

170
00:10:40,557 --> 00:10:44,228
మొట్టమొదటగా ముద్రించబడిన
స్ట్రిప్ లో మూడు పాత్రలు ఉన్నాయి.

171
00:10:44,311 --> 00:10:49,149
ఒకటి ప్యాటీ అనే చిన్న పాప, రెండవది
షెర్మీ అనే పిల్లాడు.

172
00:10:49,233 --> 00:10:52,945
అదే స్ట్రిప్ లో చార్లీ బ్రౌన్ ఉన్నాడు, తను
వారిద్దరి ముందు నుండి నడుచుకుంటూ వెళ్తాడు.

173
00:10:53,028 --> 00:10:56,823
అదిగో అక్కడ ఉన్నాడు. అతనే చార్లీ బ్రౌన్.
పాపం అమాయక "చార్లీ బ్రౌన్."

174
00:10:56,907 --> 00:10:59,743
అతను అలా వెళ్లగానే "అబ్బా, వీడంటే నాకు
చాలా అసహ్యం," అని అంటాడు.

175
00:11:00,619 --> 00:11:02,913
అది...

176
00:11:02,996 --> 00:11:04,665
కాస్త కఠినంగానే ఉన్నట్టు ఉంటుంది కదా?

177
00:11:04,748 --> 00:11:05,958
రాబ్ ఆర్మ్ స్ట్రాంగ్
కార్టూనిస్ట్, "జంప్ స్టార్ట్"

178
00:11:06,041 --> 00:11:07,876
కానీ చిన్నప్పుడు అలానే ఉంటుంది మరి.

179
00:11:07,960 --> 00:11:10,629
పిల్లలు దురుసుగానే ఉంటారు. ఒకరి పట్ల
మరొకరి ప్రవర్తన అలాగే ఉంటుంది...

180
00:11:10,712 --> 00:11:11,922
డ్రూ బారీమోర్
నటి/నిర్మాత

181
00:11:12,005 --> 00:11:15,717
...వారి ప్రవర్తన మీరు ఎలాంటి రక్షణ
కవచాలు ఏర్పాటు చేసుకోవాలో తెలియజేస్తుంది.

182
00:11:15,801 --> 00:11:18,136
ఇక మిగిలిన జీవితమంతా మీ రక్షణ కవచాన్ని ఎలా

183
00:11:18,220 --> 00:11:20,180
తీసేయాలో గుర్తు చేసుకోవడానికే సరిపోతుంది.

184
00:11:20,264 --> 00:11:23,308
అమెరికన్లు యావత్తూ చార్లీ బ్రౌన్ తో

185
00:11:23,392 --> 00:11:26,103
ప్రేమలో పడటానికి ఎంతో కాలం పట్టలేదు.

186
00:11:26,186 --> 00:11:28,522
ఈ పాత్రతో నన్ను నేను పోల్చుకోవచ్చు...

187
00:11:28,605 --> 00:11:29,606
పాల్ ఫీగ్
సినీ నిర్మాత

188
00:11:29,690 --> 00:11:33,402
...అతను కూడా నాలాగా విరక్తిగా లేదా
అందరికీ నచ్చే విధంగా కాకుండా ఉంటాడు,

189
00:11:33,485 --> 00:11:36,864
నాకు అలాగే అనిపిస్తుంది మరి.
అది చిన్న విషయం కాదు.

190
00:11:36,947 --> 00:11:38,365
జెన్నిఫర్ ఫిన్నీ బోలాన్
రచయిత్రి

191
00:11:38,448 --> 00:11:40,576
చార్లీ బ్రౌన్ ను అంతా ఆట
పట్టిస్తూ ఉండటాన్ని మనం చూస్తాం.

192
00:11:40,659 --> 00:11:45,622
అతనికి మద్దతు ఇస్తాం, దేనికంటే, అతను
ఒక మనిషి ఎలా ఉండాలో అలా ఉంటాడు.

193
00:11:45,706 --> 00:11:46,707
ఎంతటి క్లిష్టమైన పరిస్థితులనైనా
తట్టుకుని ముందుకు వెళ్తూనే ఉంటాడతను.

194
00:11:46,790 --> 00:11:47,624
మియా సెక్
నటి

195
00:11:47,708 --> 00:11:50,669
పడినా మళ్లీ లేచి, ప్రయత్నిస్తూనే ఉంటాడు.
అందుకనే అతనంటే నాకిష్టం.

196
00:11:50,752 --> 00:11:51,587
కీత్ ఎల్. విలియమ్స్
నటుడు

197
00:11:51,670 --> 00:11:54,882
చివరకు స్పార్కీ కలలు ఫలించసాగాయి,

198
00:11:54,965 --> 00:11:57,384
ఇంకా అది అతను తన వ్యక్తిత్వాన్ని
కోల్పోకుండా చేయగలిగాడు.

199
00:11:57,467 --> 00:11:59,344
చార్లీ బ్రౌన్ కి సంబంధించిన ఈ కథంతా.

200
00:11:59,428 --> 00:12:02,264
నేను పడిన కష్టాల తాలూకు జ్ఞాపకాలివి.

201
00:12:02,347 --> 00:12:08,562
చార్లీ బ్రౌన్ ఎంతో కొంత మనందరిలోనూ
ఉన్నాడన్నది నా అభిప్రాయం.

202
00:12:08,645 --> 00:12:11,523
ముఖ్యంగా నాలో. ప్రధానంగా
నేనే చార్లీ బ్రౌన్ ను.

203
00:12:17,029 --> 00:12:18,071
లైనస్,

204
00:12:18,155 --> 00:12:21,700
నా గురించి నేను 500 పదాల్లో
వ్యాసం రాసేదెలా?

205
00:12:22,201 --> 00:12:25,162
నా గురించి రాసేందుకు అంతగా ఏమీ లేదు.

206
00:12:25,245 --> 00:12:28,165
నిజానికి ఇది నీకొక గొప్ప అవకాశం,

207
00:12:28,248 --> 00:12:29,458
చార్లీ బ్రౌన్.

208
00:12:29,541 --> 00:12:31,168
దేనికి అవకాశం?

209
00:12:31,710 --> 00:12:36,089
జీవితానికి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలకు
సమాధానాలు కనుగొనేందుకు ఇదొక అవకాశం.

210
00:12:36,173 --> 00:12:40,552
నేనెవర్ని? ఇక్కడ ఎందుకు ఉన్నాను?
ఈ ప్రపంచంలో నా ఉనికికి అర్థమేమిటి?

211
00:12:40,636 --> 00:12:44,431
దేవుడా. వీటన్నింటికీ సమాధానాలు
నేనెలా వెతికేది?

212
00:12:44,515 --> 00:12:48,143
నాయనా, చార్లీ బ్రౌన్, నాకు
క్లిష్టమైన ప్రశ్నలు ఎదురైనప్పుడు,

213
00:12:48,227 --> 00:12:50,729
నేను చరిత్రకు ఎక్కిన మహామహులను
జ్ఞప్తికి తెచ్చుకుంటాను.

214
00:12:50,812 --> 00:12:54,608
స్పానిష్ నవలా రచయిత మిగెల్ డె సెర్వాంటిస్
ఏం రాశాడో తెలుసా,

215
00:12:54,691 --> 00:12:58,362
"నువ్వు ఎవరితో తిరుగుతావో చెప్పు,
నీ గురించి నేను చెబుతాను," అని.

216
00:12:59,279 --> 00:13:02,908
నేనెవరితో తిరుగుతాను అంటే?
దానికి అర్థమేమిటి?

217
00:13:02,991 --> 00:13:05,661
దానికి అర్థం నువ్వు నీ స్నేహితులను
గమనించాలని, చార్లీ బ్రౌన్.

218
00:13:05,744 --> 00:13:09,122
నువ్వు కాలక్షేపం చేసే స్నేహితులు.
వాళ్లే నీకు సాయం చేయగలరేమో.

219
00:13:09,623 --> 00:13:13,418
ఏమో మరి, లైనస్. ఇది సాధ్యమయ్యే
పనిలా కనిపించడం లేదు.

220
00:13:13,502 --> 00:13:15,045
బాధ పడకు, చార్లీ బ్రౌన్.

221
00:13:15,128 --> 00:13:19,758
జీవితానికి సంబంధించిన మౌలికమైన ప్రశ్నలకు
సమాధానాలు వెతికేందుకు వారం రోజులుందిగా.

222
00:13:23,428 --> 00:13:26,640
తను అచ్చం చార్లీ బ్రౌన్ లానే
ఉంటానని స్పార్కీ అంటూ ఉంటాడు,

223
00:13:26,723 --> 00:13:30,978
కానీ పీనట్స్ లోని ప్రతి పాత్రలోనూ
స్పార్కీ లక్షణాలు ఎంతో కొంత ఉంటాయి.

224
00:13:32,896 --> 00:13:34,314
పీనట్స్ సృష్టికర్త ఎలా...

225
00:13:34,398 --> 00:13:35,607
పేయిజ్ బ్రాడాక్ - కార్టూనిస్ట్/ క్రియేటివ్
అసోసియేట్స్ లో క్రియేటివ్ డైరెక్టర్

226
00:13:35,691 --> 00:13:37,693
...ఉండాలని మీరు అనుకుంటారో
తను అలాగే ఉంటాడు.

227
00:13:37,776 --> 00:13:40,153
అన్ని పాత్రలూ కలగలిపి
ఒక మనిషిగా రూపొందిస్తే అదే అతను.

228
00:13:40,237 --> 00:13:43,156
షుల్జ్ లోని తాత్వికమైన ఆలోచనలకు
లైనస్ ప్రతీక.

229
00:13:43,240 --> 00:13:46,535
లైనస్ లో ఈ వేదాంత
ధోరణి కనబడుతూ ఉంటుంది కదా.

230
00:13:46,618 --> 00:13:49,997
అతనొక వేదాంతి. స్పార్కీ కూడా అంతే.

231
00:13:50,080 --> 00:13:53,458
జీవితానికి అర్థం ఏమిటి, ఈ విశ్వంలో
మన స్థానం ఏమిటీ,

232
00:13:53,542 --> 00:13:58,130
అన్నింటి మధ్య సమన్వయం ఎలా కుదిరింది వంటి
పెద్ద పెద్ద ప్రశ్నలు వేస్తూ ఉంటాడు లైసన్.

233
00:13:58,213 --> 00:14:01,133
"జీవితమనేది ఎంతో
క్లిష్టమైనది, కాదంటావా, చార్లీ బ్రౌన్?"

234
00:14:01,216 --> 00:14:06,221
నన్ను నేను లైనస్ తో పోల్చుకుంటా, ఎందుకంటే
నా వద్ద కూడా పిల్లల దుప్పటి ఉండేది.

235
00:14:06,305 --> 00:14:09,266
అతనిలాగే నేను కూడా నీలం రంగు దుప్పటిని,

236
00:14:09,349 --> 00:14:11,435
నాతో తీసుకువెళ్తూ ఉండేవాణ్ని.

237
00:14:12,102 --> 00:14:14,438
నా వద్ద కూడా అలాంటి దుప్పటి ఒకటి ఉండేది.

238
00:14:15,189 --> 00:14:18,150
మా అమ్మ దుస్తులు ఉతికే చోట
ఉండే వాషర్ డ్రయ్యర్ వద్ద

239
00:14:18,233 --> 00:14:20,652
నేను నిలబడి నా దుప్పటి చూస్తూ

240
00:14:20,736 --> 00:14:25,532
వాష్ సైకిల్ సమయంలో ఏడ్చేదాన్ని, మళ్లీ
డ్రయ్యర్ సైకిల్ వచ్చినప్పుడూ ఏడ్చేదాన్ని.

241
00:14:25,616 --> 00:14:27,826
అందువల్ల అందరూ నన్ను లైనస్ అని పిలిచేవారు.

242
00:14:27,910 --> 00:14:28,911
జుప్!

243
00:14:28,994 --> 00:14:31,371
అప్పుడప్పుడు లైనస్ తెలివైనవాడిగా,
అప్పుడప్పుడు ఏమీ తెలియనివాడిలా ఉంటాడు.

244
00:14:31,455 --> 00:14:33,498
మరికొన్నిసార్లు అమాయకంగా, ఇంకొన్నిసార్లు
అన్నీ తెలిసిన ఆరిందాలా ఉంటాడు.

245
00:14:34,166 --> 00:14:38,504
అతని వ్యక్తిత్వం వల్లనే అతనిలో
అన్ని ఆలోచనలు పుట్టుకొస్తూ ఉంటాయి.

246
00:14:38,587 --> 00:14:42,674
స్పార్కీలోని మంచితనానికి
లైనస్, చార్లీ బ్రౌన్ ప్రతీకలు.

247
00:14:43,342 --> 00:14:46,595
మరోవైపు లైనస్ అక్క లూసీ...

248
00:14:46,678 --> 00:14:48,347
లూసీ చాలా దురుసు మనిషి.

249
00:14:48,430 --> 00:14:51,475
"నువ్వు చాలా బోర్ కొట్టిస్తావు,
చార్లీ బ్రౌన్."

250
00:14:51,558 --> 00:14:54,228
గయ్యాళి, భయం గొలిపే మనిషి కూడా.

251
00:14:54,311 --> 00:14:57,397
లూసీ సరదాగా ఉంటుంది,
కానీ ఆమెలో దురుసు స్వభావం ఎక్కువే.

252
00:14:57,481 --> 00:15:00,359
మనలో చాలామంది ఆమెను ఇష్టపడరు,
దేనికంటే ఆమె దురుసు మనిషి కావడమే.

253
00:15:00,442 --> 00:15:01,610
కానీ అదే సమయంలో,

254
00:15:01,693 --> 00:15:05,280
ఆమెలో దురుసుతనానికి మించిన మంచితనమూ ఉంది.

255
00:15:05,364 --> 00:15:07,950
లూసీ ఫుట్ బాల్ తో ఉంటే అప్పుడు జరిగే
హంగామా గురించి అందరికీ తెలిసిందే.

256
00:15:08,033 --> 00:15:10,494
చార్లీ బ్రౌన్ పరుగున వస్తే, లూసీ చివరి
క్షణంలో బంతిని పక్కకు లాగేస్తుంది...

257
00:15:10,577 --> 00:15:11,411
నోవా ష్నాప్
నటుడు

258
00:15:11,495 --> 00:15:12,955
...అతను పెద్దగా అరుస్తూ, పడతాడు.

259
00:15:13,038 --> 00:15:13,872
తను మళ్లీ అలాగే చేసింది!

260
00:15:13,956 --> 00:15:14,957
అద్భుతం.

261
00:15:15,040 --> 00:15:16,083
-ఆహ్!
-హా!

262
00:15:17,251 --> 00:15:18,210
దుబుక్!

263
00:15:18,293 --> 00:15:21,338
ఏ పాత్ర పట్ల నేను
ఎక్కువ సానుభూతి చూపిస్తాను?

264
00:15:21,421 --> 00:15:24,466
నాకైతే అన్నీ ఇష్టమే ఎందుకంటే ప్రతి
పాత్రలోనూ ఎంతో కొంత నా పోలికలుంటాయి.

265
00:15:24,550 --> 00:15:27,678
నాలో ఉన్న వ్యంగ్య ధోరణికి
లూసీ పాత్ర అద్దం పడుతుంది.

266
00:15:27,761 --> 00:15:30,055
నాలో అమాయకత్వానికి చార్లీ బ్రౌన్ ప్రతీక.

267
00:15:30,138 --> 00:15:30,973
నా వల్ల కాదు.

268
00:15:31,056 --> 00:15:33,350
నాలోని స్వాప్నికుడిని స్నూపీ
ప్రతిబింబిస్తుంది.

269
00:15:36,687 --> 00:15:38,021
స్నూపీ.

270
00:15:38,522 --> 00:15:42,234
చార్లీ బ్రౌన్ సహా ఇతర పాత్రలు
కాస్తో కూస్తో స్పార్కీని పోలి ఉంటే,

271
00:15:42,317 --> 00:15:44,987
ఇక స్నూపికైతే ఆకాశమే హద్దు.

272
00:15:45,070 --> 00:15:48,532
కుక్కలా ఉండేందుకు
ఏ మాత్రం అంగీకరించని కుక్క స్నూపీ,

273
00:15:48,615 --> 00:15:50,993
అది ఎంతో ఆకాంక్షగలది, కదా?

274
00:15:51,076 --> 00:15:56,081
దేవుడా. నాకు స్నూపీ అంటే ఎంతో ఇష్టం.
అది భలే ముద్దుగా, సరదాగా ఉంటుంది.

275
00:15:56,164 --> 00:15:58,375
అందరూ స్నూపీని
ఇష్టపడతారు, ఎందుకంటే, మనమంతా

276
00:15:58,458 --> 00:16:00,252
ఎలా ఉండాలనుకుంటామో అది అలా ఉంటుంది గనుక.

277
00:16:00,335 --> 00:16:03,255
"సరే, నేను ఇవాళ యుద్ధ విమానం నడుపుతాను,

278
00:16:03,338 --> 00:16:06,967
మర్నాడు, నేను ఇవాళ ఒక గొప్ప నటుడిలా
ఉంటాను," అని ఏవేవో ఊహించుకుంటాం.

279
00:16:07,050 --> 00:16:09,678
స్నూపీ అచ్చం అలానే ఉంటూ,
తనదైన లోకంలో విహరిస్తూ ఉంటుంది.

280
00:16:09,761 --> 00:16:14,057
కానీ స్నూపీకి కూడా స్పార్కీ
జీవితంలో నిజంగా చోటు ఉన్నమాట నిజం.

281
00:16:14,141 --> 00:16:16,643
నాకు 13 ఏళ్ళ వయస్సున్నప్పుడు
నా దగ్గర ఉన్న కుక్కను

282
00:16:16,727 --> 00:16:18,604
ఆధారంగా తీసుకొని
స్నూపీ పాత్రను రూపొందించాను.

283
00:16:18,687 --> 00:16:22,482
స్నూపీ హాకీ, ఐస్ స్కేటింగ్ ఆడటానికి
కారణమేంటంటే, షుల్జ్ అవే ఆటలు ఆడేవాడు.

284
00:16:22,566 --> 00:16:23,400
పెనాల్టీ బాక్స్

285
00:16:23,483 --> 00:16:24,943
కాబట్టి, పాత్రలకు జీవం పోసే అందరిలాగే,

286
00:16:25,027 --> 00:16:26,862
అతని పోలికలు కూడా పాత్రలలో
బాగా కనిపిస్తాయి,

287
00:16:26,945 --> 00:16:30,282
పాత్రలు మాట్లాడే విధానంలోనూ,
వాటి ఇష్టాయిష్టాల విషయంలోనూ

288
00:16:30,365 --> 00:16:32,284
ఆ సంగతి స్పష్టంగా బోధపడుతుంది.

289
00:16:41,752 --> 00:16:44,171
ఈ వ్యాసం రాసి మంచి మార్కులు కొట్టేయాలి.

290
00:16:45,005 --> 00:16:47,174
నేను ఒక నిపుణుడిని సంప్రదిస్తే మంచిదేమో.

291
00:16:48,717 --> 00:16:50,719
మానసిక వైద్య సహాయం 5 సెంట్లు
డాక్టర్ ఉన్నారు

292
00:16:50,802 --> 00:16:54,473
హాయ్, చార్లీ బ్రౌన్. ఇవాళ నీ సమస్య ఏంటి?

293
00:16:54,556 --> 00:16:57,392
నా వ్యాసం రాయడంలో
ఇబ్బంది పడుతున్నాను, లూసీ.

294
00:16:57,476 --> 00:16:58,644
నువ్వేమన్నా సాయం చేయగలవా?

295
00:16:58,727 --> 00:17:02,564
తప్పకుండా. నిజానికి నీ గురించి, నీలోని
లోపాల గురించి నేనెంతో ఆలోచించాను.

296
00:17:02,648 --> 00:17:06,777
నా లోపాలా? నేను వ్యాసం రాయడానికి
అవి ఎలా తోడ్పడతాయో...

297
00:17:06,859 --> 00:17:07,861
చూడు, చార్లీ బ్రౌన్.

298
00:17:07,944 --> 00:17:09,780
ఒక నిపుణుడు నీలో ఉన్న ఎన్నో లోపాలను

299
00:17:09,863 --> 00:17:12,657
ఎత్తి చూపించడానికి మించి నువ్వెవరో
తెలుసుకోవడానికి మరో మంచి మార్గం లేదు.

300
00:17:13,157 --> 00:17:14,576
నాలో ఎన్నో లోపాలున్నాయా?

301
00:17:14,660 --> 00:17:15,827
అవును.

302
00:17:15,911 --> 00:17:20,207
అందుకోసం నేనొక వ్యవస్థను రూపొందించాను,
అది చూస్తే, నీకు అవగాహన కలుగుతుంది.

303
00:17:23,292 --> 00:17:25,337
సౌకర్యవంతంగా కూర్చో, చార్లీ బ్రౌన్.

304
00:17:25,838 --> 00:17:29,591
నీలోని లోపాలు, చిన్నపాటి తప్పిదాలపై నేను
కొన్ని వందల స్లైడ్లు రూపొందించాను.

305
00:17:31,343 --> 00:17:32,427
దయచేసి, లైట్లు ఆపేయండి.

306
00:17:41,895 --> 00:17:44,189
నీ చిన్నతనం నుంచి మొదలు పెడదాం.

307
00:17:44,273 --> 00:17:45,482
అమాయక చార్లీ బ్రౌన్... అవును, సర్!

308
00:17:45,566 --> 00:17:48,110
చూస్తున్నావుగా, చిన్నప్పటి నుంచీ,

309
00:17:48,193 --> 00:17:50,529
నిన్నెవరూ ఇష్టపడేవారు కాదు.

310
00:17:50,612 --> 00:17:51,613
వీడంటే నాకు
చాలా అసహ్యం!

311
00:17:51,697 --> 00:17:52,948
నీకు గుర్తింపు లేదు.

312
00:17:55,033 --> 00:17:58,036
నీ తోటివారికి ఉన్నంత నైపుణ్యం
నీలో ఉండేది కాదు.

313
00:17:58,954 --> 00:17:59,955
చూశావా?

314
00:18:00,831 --> 00:18:02,040
ఇప్పుడు, మరికాస్త శ్రద్ధగా చూడు.

315
00:18:03,458 --> 00:18:06,545
మనం మరింత లోతుగా పరిశోధిస్తే,
ఒక నమూనా మనకు కళ్లకు కడుతుంది,

316
00:18:06,628 --> 00:18:09,339
వరుస వైఫల్యాలకు ప్రతీక ఆ నమూనా.

317
00:18:09,423 --> 00:18:10,883
ఢమాల్!

318
00:18:12,092 --> 00:18:13,552
నీ నాయకత్వంలో,

319
00:18:13,635 --> 00:18:17,389
నువ్వు ఆడిన ప్రతీ ఆట కూడా
మీ బేస్ బాల్ జట్టు ఓడిపోయింది.

320
00:18:17,472 --> 00:18:20,100
మేం కొన్నిసార్లు గెలిచాం.

321
00:18:20,184 --> 00:18:23,270
అవును, మీరు గెలిచింది
నీ చెయ్యి విరిగినప్పుడు మాత్రమే.

322
00:18:25,772 --> 00:18:27,941
ఆటలకు సంబంధించిన మరో విషయం,

323
00:18:28,775 --> 00:18:32,112
నువ్వు ఇప్పటిదాకా ఒక్కసారి కూడా
ఫుట్ బాల్ ను తన్నలేకపోయావు.

324
00:18:33,614 --> 00:18:34,615
చూశావా?

325
00:18:35,407 --> 00:18:39,077
జట్టుతో కాకుండా, నువ్వు ఒంటరిగా
ఆడిన ఆటల్లోనూ నీకు ఓటమే ఎదురైంది.

326
00:18:41,038 --> 00:18:43,290
ఇతరులతో కలసి ఆడినా,
ఒక్కడివే ఆడినా నీది ఓటమే.

327
00:18:44,333 --> 00:18:47,044
ఇక వేలంటైన్స్ డే సంగతి చూద్దాం.

328
00:18:48,962 --> 00:18:50,380
అబ్బా!

329
00:18:50,464 --> 00:18:53,300
చాలు! ఇంక నేను చూడలేను.

330
00:18:56,720 --> 00:19:01,475
నీ వ్యాసానికి నేను సాయపడ్డాననుకుంటా!
త్వరలో వర్గీకృత బిల్లు పంపిస్తా!

331
00:19:03,769 --> 00:19:07,940
ఓటమి, ఓటమి, ఓటమి.

332
00:19:08,023 --> 00:19:09,191
నిట్టూర్పు

333
00:19:09,274 --> 00:19:12,945
చార్లీబ్రౌన్ పాత్ర రూపకల్పనలో తన
చిన్ననాటి అనుభవాలే స్పార్కీకి దోహదపడ్డాయి.

334
00:19:15,072 --> 00:19:16,657
కానీ తనకు పిల్లలు పుట్టాక,

335
00:19:16,740 --> 00:19:19,868
వాళ్ల బాల్యంలో నుంచే పీనట్స్ లోని
పాత్రలు ప్రాణం పోసుకున్నాయి.

336
00:19:19,952 --> 00:19:24,373
నా పిల్లలను గమనిస్తూ ఉంటేనే
నాకు ఎన్నో ఐడియాలు తట్టేవన్న సంగతిని

337
00:19:24,456 --> 00:19:28,377
నేను ఒప్పుకుని తీరాల్సిందే.

338
00:19:28,460 --> 00:19:32,005
వాళ్ల మధ్య జరిగే చిన్నపాటి
వాదులాటలు వంటివాటిని గమనిస్తే,

339
00:19:32,089 --> 00:19:34,091
నాకు ఎన్నో ఐడియాలు తట్టేవి.

340
00:19:34,174 --> 00:19:38,846
ఏదో ఒక దృష్టి కోణం నుంచి
చూసినప్పుడు మాత్రమే

341
00:19:38,929 --> 00:19:42,224
వినోదం బాగా పండుతుందనేది నా నమ్మకం.

342
00:19:42,307 --> 00:19:47,521
పాత్రలకు ప్రాణం పోసే వ్యక్తి విషయంలో
అతని స్వీయానుభవాలే అతని దృష్టికోణం.

343
00:19:47,604 --> 00:19:51,567
చిన్నప్పటినుంచీ కూడా ఒకటి అనుకునేవాణ్ని,

344
00:19:51,650 --> 00:19:54,111
అదేంటంటే, ఎవరో ఒక వ్యక్తి అమెరికాలో
ఎక్కడో ఉన్నాడని,

345
00:19:54,194 --> 00:19:58,782
తను ఒక పెద్ద డెస్కు ముందు కూర్చునే వాడని,
అతనికి భార్యా బిడ్డలు కూడా ఉండేవారని.

346
00:19:58,866 --> 00:20:01,910
అతను లేచి, స్నూపీ బొమ్మ గీసి, తర్వాత ఐస్
స్కేటింగ్ చేసేవాడనీ అనుకునేవాణ్ని.

347
00:20:01,994 --> 00:20:04,371
ఒక కుర్రాడు నమూనా
విమానాలు తయారు చేస్తూ ఉన్నాడు,

348
00:20:04,454 --> 00:20:06,331
తాజాగా తాను తయారు చేసిన ఒక
నమూనాను నాకు చూపించాడు.

349
00:20:06,415 --> 00:20:09,918
అంతే, అకస్మాత్తుగా స్నూపీ ఒక
డాగ్ హౌస్ పై నిలబడి

350
00:20:10,002 --> 00:20:12,629
యుద్ధ విమానం నడుపుతున్నట్టు ఊహించుకుంటున్న
బొమ్మ గీస్తే ఎలా ఉంటుందన్న ఐడియా తట్టింది.

351
00:20:12,713 --> 00:20:15,966
ఒక రోజు, అతని కొడుకు క్రెగ్ ఏదో
మాట్లాడుతుంటే అతను వింటున్నాడు,

352
00:20:16,049 --> 00:20:18,260
ఈలోగా అటుగా ఓ కుర్రాడు వచ్చాడు,
అతన్ని చూసి క్రెగ్,

353
00:20:18,343 --> 00:20:20,679
" అతన్ని చూస్తే జోయ్ కూల్ లాగ
ఉన్నాడు కదూ," అన్నాడు.

354
00:20:20,762 --> 00:20:22,389
అలా జోయ్ కూల్ అనే పాత్ర ఆవిర్భవించింది.

355
00:20:23,390 --> 00:20:27,060
కామిక్ స్ట్రిప్ లోని ప్రతి విషయమూ
స్పార్కీకి సంబంధించినదే.

356
00:20:27,144 --> 00:20:31,940
ష్రోయడర్ సింఫనీ వాయిస్తున్నట్టు
అతను రాశాడంటే,

357
00:20:32,024 --> 00:20:33,775
అది అతనికి ఎంతో ఇష్టమైన సింఫనీ అని అర్థం.

358
00:20:33,859 --> 00:20:34,693
దేవుడా!

359
00:20:34,776 --> 00:20:36,236
తన జీవితాన్నే స్ఫూర్తిగా
తీసుకుని అతను బొమ్మలు గీశాడు.

360
00:20:36,320 --> 00:20:39,865
మనం అతని పక్కనే ఉన్నప్పుడు తను మనల్ని
ఎలా పరిశీలిస్తున్నాడా అని ఆశ్చర్యపోతాం.

361
00:20:39,948 --> 00:20:44,661
తనని బంగారు కొండ అని పిలిచేదాన్ని. తర్వాత
అదే పేరు కామిక్ స్ట్రిప్ లో కనిపించింది...

362
00:20:44,745 --> 00:20:48,415
"ఇది నా బంగారు కొండకు ప్రత్యేకం."

363
00:20:48,498 --> 00:20:50,584
...ఇదే పేరుతో పిలుస్తూ శాలీ...

364
00:20:50,667 --> 00:20:52,085
నా బంగారు కొండకు
హ్యాపీ వాలెంటైన్స్ డే!

365
00:20:52,169 --> 00:20:53,378
...లైనస్ ని హింసించేది.

366
00:20:53,462 --> 00:20:56,089
"నేను నీ బంగారు కొండను కాదు."

367
00:20:56,173 --> 00:20:58,842
"పిగ్పెన్." ఈ పదానికి అర్థం ఏంటి?

368
00:20:58,926 --> 00:21:03,722
నా స్నేహితుడు తన పిల్లల్ని వింత పేర్లతో
పిలిచేవాడు. అలా వచ్చింది "పిగ్పెన్."

369
00:21:03,805 --> 00:21:06,391
తన కొడుకు హాలులో పరిగెత్తుతూ ఉంటే,
అతన్ని ఉద్దేశించి,

370
00:21:06,475 --> 00:21:07,893
"వెళ్లి పడుకో, పిగ్పెన్," అన్నాడు.

371
00:21:07,976 --> 00:21:11,313
అప్పుడు ఈ పేరు నా కామిక్ స్ట్రిప్ లో ఏదైనా
పాత్రకు పెడితే బాగుంటుందని అనిపించింది.

372
00:21:11,396 --> 00:21:15,275
ఇదొక చిత్రమైన పాత్ర,
ఎప్పుడూ నవ్వులపాలవుతూ ఉంటాడు.

373
00:21:15,359 --> 00:21:16,818
అప్పుడప్పుడు ఇతర పాత్రలు,

374
00:21:16,902 --> 00:21:20,197
పిగ్పెన్ వద్దకు వచ్చి "నిన్ను చూసి
నువ్వు సిగ్గు పడాలి," అంటూ ఉంటాయి.

375
00:21:20,781 --> 00:21:23,450
"అతను ఎలా కనిపిస్తాడో తెలుసా?" "ఎలా?"

376
00:21:23,951 --> 00:21:26,161
"మట్టి మనిషి."

377
00:21:26,245 --> 00:21:30,582
అయినా అతనేం బాధపడేవాడు కాదు.
పిగ్పెన్ లో ఉన్న హుందాతనం అదే.

378
00:21:30,666 --> 00:21:33,043
ఒక హిజ్రా చిన్నారిగా,

379
00:21:33,126 --> 00:21:35,462
నాకు ఆ విషయం నచ్చింది అనుకుంటాను.

380
00:21:45,889 --> 00:21:48,267
లూసీ వల్ల ఏమీ ఉపయోగం లేదు.

381
00:21:48,350 --> 00:21:50,644
మరొకరి అభిప్రాయం తీసుకోవడం మంచిదనుకుంటా.

382
00:21:51,562 --> 00:21:56,191
తొంభై ఏడు, 98, 99, 100.

383
00:21:56,275 --> 00:21:57,484
ఇప్పుడు నా వంతు.

384
00:22:02,447 --> 00:22:03,574
పిగ్పెన్!

385
00:22:05,701 --> 00:22:07,327
నువ్వు అంతా పాడు చేస్తున్నావు.

386
00:22:24,928 --> 00:22:28,348
హాయ్, చార్లీ బ్రౌన్. మట్టి పిడకలు
చేయడంలో నాకు సాయం చేస్తావా?

387
00:22:28,432 --> 00:22:33,270
నాకు వీలు కాదు, పిగ్పెన్.
నేను స్కూల్ ప్రాజెక్టు ఒకటి పూర్తి చేయాలి.

388
00:22:33,353 --> 00:22:35,856
హే! రండి, మాతో తాడు ఆట ఆడండి!

389
00:22:35,939 --> 00:22:38,734
కుదరదు. ఆ ఎర్ర జుట్టు అమ్మాయి
ఇటే వస్తోంది.

390
00:22:41,737 --> 00:22:43,697
ఏమైంది, చార్లీ బ్రౌన్?

391
00:22:43,780 --> 00:22:46,700
-తను నన్ను చూడకూడదు.
-ఎందుకని?

392
00:22:47,284 --> 00:22:49,286
తను నన్ను చూసి ఇష్టపడకపోతే?

393
00:22:49,828 --> 00:22:53,040
నీకు నువ్వు నచ్చావా లేదా అన్నదే ముఖ్యం.

394
00:22:53,123 --> 00:22:55,542
నన్ను నేను ఇష్టపడతాను. ఇతరులు
ఏమనుకుంటున్నారో నాకు అనవసరం.

395
00:22:56,251 --> 00:23:00,631
నిజంగా? నువ్వు... మురికిగా ఉంటావని
వాళ్లనుకున్నా సరేనా?

396
00:23:01,131 --> 00:23:06,136
నేను మురికిగా ఉన్నానని అనుకోను.
నేను చరిత్రలో ఒక భాగమని,

397
00:23:06,220 --> 00:23:09,723
ఏళ్ల తరబడి దుమ్మూ ధూళితో
ఉన్నానని భావిస్తాను.

398
00:23:09,806 --> 00:23:12,392
నీ అంతటి ఆత్మ విశ్వాసం నాకు
లేదు, పిగ్పెన్.

399
00:23:13,393 --> 00:23:16,396
ఆ చిట్టి ఎర్ర జుట్టు అమ్మాయి నన్ను
చూడక ముందే నేను వెళ్లిపోవడం మంచిది.

400
00:23:18,982 --> 00:23:20,567
పిచ్చి చార్లీ బ్రౌన్.

401
00:23:27,574 --> 00:23:29,117
చార్లీ బ్రౌన్ మాదిరిగానే,

402
00:23:29,201 --> 00:23:33,205
నిజ జీవితంలో స్పార్కీకి కూడా
ఒక ఎర్ర జుట్టు అమ్మాయి ఉండేది.

403
00:23:33,705 --> 00:23:38,126
యువకుడిగా ఉన్నప్పుడు స్పార్కీ కూడా డొనా
వోల్డ్ అనే ఎర్ర జుట్టు అమ్మాయిని కలిశాడు.

404
00:23:38,710 --> 00:23:41,713
ఆమెతో పీకల్లోతు ప్రేమలో పడ్డాడు.

405
00:23:41,797 --> 00:23:45,384
డోనాకు అప్పటికే ఒక అగ్నిమాపక శాఖలో
పని చేసేవాడితో పెళ్లి కుదిరింది,

406
00:23:45,467 --> 00:23:49,012
అయితే అతన్ని చేసుకోవాలో వద్దో అనే
సందేహంలో ఉండేది.

407
00:23:49,096 --> 00:23:53,058
దాంతో అతనితో తెగతెంపులు చేసుకుని,
స్పార్కీతో చేయి కలిపింది.

408
00:23:54,601 --> 00:23:57,187
తను నన్ను పెళ్లి చేసుకుంటుందని
ఎన్నో కలలు కనేవాణ్ని.

409
00:23:59,106 --> 00:24:00,315
కానీ తను నన్ను పెళ్లి చేసుకోలేదు.

410
00:24:00,816 --> 00:24:03,902
"నేను మరింత కష్టపడితే,

411
00:24:03,986 --> 00:24:06,029
నేను అలా చేస్తే, లేదా ఇలా చేస్తే...

412
00:24:06,113 --> 00:24:08,782
తను ఆ మంటలు ఆర్పేవాణ్ని మరచిపోయి
నన్ను చేసుకుంటుంది," అని అతను అనుకునేవాడు.

413
00:24:08,866 --> 00:24:12,494
కానీ, ఆమె ఒక నిర్ణయం తీసుకొని ఆ మంటలు
ఆర్పేవాణ్ని పెళ్లి చేసేసుకుంది.

414
00:24:12,578 --> 00:24:18,166
ఆమెను ఎంతగానో ఆరాధించాను.
నా మనసు ఇచ్చా. కానీ ఆమె వెళ్లిపోయింది.

415
00:24:18,250 --> 00:24:19,376
ఎవరూ నన్ను ఇష్టపడరని తెలుసు..

416
00:24:19,459 --> 00:24:23,463
ఆ విషయాన్ని సరిగ్గా చూసుకోలేదు.
దాని గురించి ఎన్నో ఏళ్లు కలలు కన్నాను.

417
00:24:24,464 --> 00:24:27,176
ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు.

418
00:24:27,259 --> 00:24:30,429
చార్లీ బ్రౌన్ విషయంలో కూడా
జరిగింది అదే కదా.

419
00:24:30,512 --> 00:24:32,931
-ఉత్తరాలు
-ఫ్లిప్!

420
00:24:36,852 --> 00:24:39,730
పీనట్స్ గ్యాంగ్ లో ప్రేమ కలసి రాని వ్యక్తి

421
00:24:39,813 --> 00:24:41,481
చార్లీ బ్రౌన్ ఒక్కడే కాదు.

422
00:24:41,565 --> 00:24:44,193
ప్రతిఫలం ఆశించని ప్రేమ
పీనట్స్ ప్రపంచానికి సొంతం.

423
00:24:45,319 --> 00:24:47,863
లూసీకి ష్రోయడర్ అంటే ఇష్టం.

424
00:24:47,946 --> 00:24:50,866
అతనేమో ఎప్పుడూ "కుదరదు" అంటాడు.
నాకు నవ్వు తెప్పించే అంశం అదే.

425
00:24:50,949 --> 00:24:52,075
లాలో అల్కరాజ్
కార్టూనిస్ట్, "లా కుకరచ్చా"

426
00:24:52,159 --> 00:24:53,702
లైనస్ అంటే శాలికి ఇష్టం.

427
00:24:53,785 --> 00:24:56,788
ఒక సందర్భంలో, పెప్పెర్ మింట్ ప్యాటీ
చార్లీ బ్రౌన్ ను ఇష్టపడుతుంది.

428
00:24:56,872 --> 00:25:00,876
ఇలా పిల్లల మధ్య తెగిపోని బంధం ఉంటుంది

429
00:25:00,959 --> 00:25:07,174
వాళ్ల గుండెల నిండా ప్రేమ ఉంటుంది,
ఆ ప్రేమకు... ప్రతిస్పందన మాత్రం దొరకదు.

430
00:25:08,175 --> 00:25:10,302
చిట్టి ఎర్ర జుట్టు అమ్మాయి కోసం
అతని ఎడ తెగని ప్రయత్నం

431
00:25:10,385 --> 00:25:13,514
ఒక విధంగా నాకు సంబంధించినదే అనిపిస్తుంది,

432
00:25:13,597 --> 00:25:15,974
ఎందుకంటే స్కూల్లో ఒక అమ్మాయి అంటే

433
00:25:16,058 --> 00:25:21,188
నేను పడి చచ్చేవాణ్ని, కానీ ఎప్పుడూ
ఆమె దగ్గరకైనా వెళ్లలేదు నేను.

434
00:25:21,271 --> 00:25:22,272
ఇరా గ్లాస్
"దిస్ అమెరికన్ లైఫ్"

435
00:25:22,356 --> 00:25:24,942
"ఎలాగైనా సరే ఇవాళ ఆమె దగ్గరకు వెళ్తాను.

436
00:25:25,025 --> 00:25:27,069
వెళ్లి ఆ ఎర్రజుట్టు అమ్మాయితో మాట్లాడి
తీరతాను" అని అనుకుంటాను.

437
00:25:27,152 --> 00:25:30,072
ఎప్పుడూ "ఇవాళే" అని అనుకుంటుంటాను.
కానీ ఆ ఇవాళ అనేది ఎప్పటికీ రానే రాదు.

438
00:25:30,155 --> 00:25:32,574
ప్రేమ నీ చేత
చిత్ర విచిత్రమైన పనులు చేయిస్తుంది...

439
00:25:50,342 --> 00:25:52,135
నీలో చాలా ప్రతిభ ఉంది, ష్రోయడర్.

440
00:25:52,886 --> 00:25:55,889
అందరూ నిన్ను ఇష్టపడటానికి
నీ సంగీతమే కారణమంటావా?

441
00:25:57,099 --> 00:26:00,769
కావచ్చు, చార్లీ బ్రౌన్,
కానీ గమ్మత్తైన విషయం ఏంటంటే,

442
00:26:00,853 --> 00:26:05,148
ఏకాంతంగా కూర్చుని పియానో వాయించడమే
నాకు ఎంతో ఇష్టమైన పని.

443
00:26:10,028 --> 00:26:12,698
నువ్వెవరో నీ సంగీతమే చెబుతోంది
అన్నట్టు అన్నమాట.

444
00:26:13,574 --> 00:26:16,577
మరి నేనెవరో చెప్పే సంగీతం ఏమై ఉంటుందో.

445
00:26:26,044 --> 00:26:30,257
నీ వ్యాసం ఎంత వరకూ వచ్చింది చార్లీ బ్రౌన్?
నా స్లైడ్ షో ఏమైనా ఉపయోగపడిందా?

446
00:26:33,760 --> 00:26:36,972
హాయ్, ష్రోయడర్. నన్ను మిస్ అయ్యావా?

447
00:26:48,775 --> 00:26:53,488
ఏళ్లు గడుస్తుంటే, పీనట్స్ కూడా
ఎదిగింది, స్పార్కీలాగానే అది కూడా మారింది.

448
00:26:53,572 --> 00:26:56,200
ఎప్పుడూ సరదాయే అందులో ప్రధానాంశం కాదు.

449
00:26:56,283 --> 00:27:00,287
నా పిల్లలు ఎదిగారు, స్ట్రిప్ లో
పిల్లలకు ప్రాతినిథ్యం తగ్గుతూ వచ్చింది.

450
00:27:00,370 --> 00:27:02,873
స్ట్రిప్ ఒక సంగ్రహతను సంతరించుకుంది,

451
00:27:02,956 --> 00:27:06,502
అందులోని పిల్లల పాత్రలు పెద్దలకు
ప్రతిరూపాలుగా,

452
00:27:06,585 --> 00:27:10,005
పెద్దలు ఎదుర్కునే సమస్యలకు
ప్రతీకలుగా మారుతూ వచ్చాయి.

453
00:27:11,215 --> 00:27:14,301
అది ముద్దులొలికే కార్టూన్,
నవ్వించే పాత్రలు, సరదా సన్నివేశాలు.

454
00:27:14,384 --> 00:27:17,888
కానీ వాటిలోనూ ఎంతో నిగూఢత దాగి ఉంది.

455
00:27:17,971 --> 00:27:21,600
పాత్రలు చాలా సంక్లిష్టమైనవి,
మనుషుల భావాలనూ, భావావేశాలనూ,

456
00:27:21,683 --> 00:27:24,686
వారి పరిస్థితులను అవి ప్రతిఫలించేవి.

457
00:27:25,270 --> 00:27:32,236
మనుషుల మనోభావాలను
ఒడిసిపట్టుకోవడంలో అతను బహు నేర్పరి.

458
00:27:32,319 --> 00:27:33,195
అల్ రోకర్
జర్నలిస్ట్

459
00:27:33,278 --> 00:27:35,864
దేశం యొక్క మనోభావాన్ని
తను ఇట్టే పట్టేశాడు.

460
00:27:35,948 --> 00:27:37,658
తను ఎప్పుడూ సత్యం కోసం
అన్వేషిస్తూ ఉండేవాడని...

461
00:27:37,741 --> 00:27:38,742
బిల్లీ జీన్ కింగ్
టెన్నిస్ ఛాంపియన్/హక్కుల కార్యకర్త

462
00:27:38,825 --> 00:27:40,035
...అదే చెప్పేవాడని నాకనిపిస్తుంది.

463
00:27:40,118 --> 00:27:45,207
ఈ ప్రపంచం అందరికీ ఒక సమానమైన వేదిక కావాలని
అభిలషించేవాడు. తను నమ్మిన సత్యం అదే.

464
00:27:46,959 --> 00:27:51,588
60ల దశకం చివర్లో, పెప్పర్మింట్
ప్యాటీకి స్పార్కీ రూపకల్పన చేశాడు,

465
00:27:51,672 --> 00:27:54,216
ఆమె ఒక స్వతంత్రమైన అమ్మాయి,
తన తల్లితో కలిసి ఉంటుంది,

466
00:27:54,299 --> 00:27:58,178
శాండల్స్, షార్ట్స్ వేసుకుని, స్కూల్
నిబంధనావళిని ఉల్లంఘిస్తుంది.

467
00:27:59,054 --> 00:28:01,348
ఆమె అందరిలా ఉండదు.

468
00:28:01,431 --> 00:28:03,725
కామిక్ పేజీల్లో సాధారణంగా కనిపించేటటువంటి

469
00:28:03,809 --> 00:28:05,352
మహిళ పాత్రలా తన పాత్ర ఉండదు.

470
00:28:05,435 --> 00:28:07,312
తనకంటూ ఒక సొంత వ్యక్తిత్వం ఉంది.

471
00:28:07,396 --> 00:28:10,691
ఆమె విలక్షణంగా ఉండేది.
అలా ఉండటం ఆమెకు నచ్చుతుంది,

472
00:28:10,774 --> 00:28:12,192
తన గురించి తనకు పూర్తి అవగాహన ఉంది.

473
00:28:12,860 --> 00:28:15,362
పెప్పర్మింట్ ప్యాటీకి
మార్కులు బాగా వచ్చేవి కావు.

474
00:28:15,445 --> 00:28:18,240
తను ఎప్పుడూ తరగతి గదిలో నిద్రపోతూ ఉంటుంది.

475
00:28:19,324 --> 00:28:20,659
కానీ ఆమె బేస్ బాల్ లో
బంతిని చక్కగా విసిరేది.

476
00:28:20,742 --> 00:28:24,496
చక్ బేస్ బాల్ జట్టును
ఆమె ప్రతిసారీ ఓడించేది.

477
00:28:24,580 --> 00:28:27,541
కొన్నిసార్లయితే, 100-1 స్కోరు తేడాతో.

478
00:28:28,125 --> 00:28:30,002
ఆటలంటే ఇష్టపడే పెప్పర్మింట్ ప్యాటీ పాత్ర

479
00:28:30,085 --> 00:28:33,589
పాక్షికంగా స్పార్కీ స్నేహితురాలైన
టెన్నిస్ దిగ్గజం

480
00:28:33,672 --> 00:28:36,884
బిల్లీ జీన్ కింగ్ ను అధారంగా చేసుకొని
రూపొందించబడింది.

481
00:28:37,634 --> 00:28:40,304
మహిళలు, అందులోనూ
క్రీడల్లో రాణించే అమ్మాయిలను చూస్తే,

482
00:28:40,387 --> 00:28:43,348
అమ్మాయిని కాబట్టి నాకు " అద్భుతం కదా,"
అని నాకు అనిపిస్తుంది.

483
00:28:43,432 --> 00:28:45,017
స్పార్కీ చాలా పెద్ద స్త్రీవాది.

484
00:28:45,100 --> 00:28:46,935
పీనట్స్ ప్రపంచంలో,

485
00:28:47,019 --> 00:28:50,230
తాను రూపొందించే అమ్మాయిల పాత్రలు
దృఢమైనవిగా,

486
00:28:50,314 --> 00:28:52,399
కొన్ని సందర్భాల్లో అబ్బాయిల కంటే
దృఢమైనవిగా ఉండేలా చూసేవాడు.

487
00:28:52,482 --> 00:28:53,317
మాట్లాడు!

488
00:28:53,400 --> 00:28:55,736
కామిక్ స్ట్రిప్పులు నిజంగానే
మన సంస్కృతిని ప్రతిబింబించాయి.

489
00:28:55,819 --> 00:29:01,200
పిల్లలు అనుసరిస్తున్న కొత్త ట్రెండ్ అయిన
మరింత స్వతంత్రంగా, నిర్భయంగా వ్యవహరించే

490
00:29:01,283 --> 00:29:03,493
తీరుకు నిజంగానే పెప్పర్మింట్ ప్యాటీ
ప్రాతినిధ్యం వహిస్తుండవచ్చు.

491
00:29:03,577 --> 00:29:07,456
"ఇదిగో వస్తున్నా, కాచుకోండి!
దమ్ముంటే నన్ను అడ్డుకోండి!"

492
00:29:07,539 --> 00:29:08,540
బిషా!

493
00:29:12,794 --> 00:29:13,837
పర్యాటక జట్టు
12

494
00:29:13,921 --> 00:29:14,922
ఆతిథ్య జట్టు
00

495
00:29:41,698 --> 00:29:42,741
యా!

496
00:29:45,410 --> 00:29:46,411
అదీ!

497
00:29:52,960 --> 00:29:54,211
భలే ఆడావు, చక్.

498
00:29:54,294 --> 00:29:56,880
కానీ ఇక్కడ నీ ఏకాగ్రత దెబ్బ తిన్నట్టుంది.

499
00:29:56,964 --> 00:30:00,133
ఈ దిబ్బ మీద నిల్చోవద్దని నీ టీమ్ మేనేజర్
నీకు చెప్పలేదంటే ఆశ్చర్యంగా ఉంది.

500
00:30:00,217 --> 00:30:02,302
మేనేజర్ అతనే సర్.

501
00:30:02,886 --> 00:30:04,721
నీకేం కాలేదుగా, చార్లీ బ్రౌన్?

502
00:30:04,805 --> 00:30:06,807
నా హోమ్ వర్క్ గురించి ఆలోచిస్తున్నా.

503
00:30:06,890 --> 00:30:09,351
జీవితానికి అర్థం ఏంటన్నది
నేను కనుక్కోవాలి.

504
00:30:09,434 --> 00:30:12,229
బాబోయ్, చక్, అది చాలా కష్టమైన పనే.

505
00:30:12,312 --> 00:30:15,482
మా టీచర్ మాకు ఏ హోమ్ వర్క్ ఇవ్వనందుకు
నాకు చాలా ఆనందంగా ఉంది.

506
00:30:15,566 --> 00:30:18,318
మనకు ఈ వారంలో ప్రతీ రోజూ
హోమ్ వర్క్ ఉంది కదా, సర్.

507
00:30:19,695 --> 00:30:22,614
జీవితానికి అర్థం ఏమిటనే విషయంలో
జనం ఎప్పుడూ గందరగోళంలో పడుతూనే ఉంటారు,

508
00:30:22,698 --> 00:30:23,699
చార్లీ బ్రౌన్.

509
00:30:23,782 --> 00:30:26,827
ప్రేమను ఇచ్చి పుచ్చుకోవడమే
జీవితానికి పరమార్థమని

510
00:30:26,910 --> 00:30:28,620
మా తాతగారు ఎప్పుడూ చెబుతూ ఉండేవారు.

511
00:30:30,664 --> 00:30:32,749
ఆయన ఎప్పుడూ నిట్టూరుస్తూ ఉండేవారు కూడా.

512
00:30:34,251 --> 00:30:36,920
నన్ను అసలు ఎవరైనా ప్రేమించగలరా అనేది
నాకు అంతుపట్టని విషయం.

513
00:30:37,004 --> 00:30:41,633
సాయం చెయ్యమని లూసీని అడిగితే,
తను నాలోని తప్పులను మాత్రమే చెప్పింది.

514
00:30:41,717 --> 00:30:43,760
అసలు నాలో మంచి లక్షణాలే లేవా?

515
00:30:43,844 --> 00:30:47,598
తప్పకుండా ఉన్నాయి, చక్.
నీలో ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయి.

516
00:30:47,681 --> 00:30:50,767
అవునా? మచ్చుకు ఒకటి చెప్పు.

517
00:30:55,647 --> 00:30:58,066
నువ్వు చాలా దయగల వాడివి.

518
00:31:00,944 --> 00:31:02,237
చాలా మంచివాడివి.

519
00:31:02,321 --> 00:31:05,782
నువ్వు అందరికీ సాయపడతావు,
ఎంతో సాయం చేస్తావు, చక్.

520
00:31:05,866 --> 00:31:10,662
వావ్. మంచితనం, దయ, సాయపడటం.
ధన్యవాదాలు, మిత్రులారా!

521
00:31:11,163 --> 00:31:13,081
హేయ్, లూసీ. ఓ విషయం చెప్పనా?

522
00:31:13,165 --> 00:31:17,002
నువ్వు చెప్పింది తప్పు.
నేను దయగలవాణ్ని, మంచివాణ్ని, సాయపడేవాణ్ని.

523
00:31:17,085 --> 00:31:19,421
అలా అని వాళ్లు కాక ఇంకెవరు చెప్తారు,
చార్లీ బ్రౌన్.

524
00:31:19,505 --> 00:31:22,132
నువ్వు విసిరే బంతులను చాలా తేలిగ్గా
కొట్టగలరు కనుక నీకు మంచితనం ఉంది.

525
00:31:22,216 --> 00:31:24,593
వాళ్లకి నువ్వు చాలా పరుగులు ఇస్తున్నావు
కనుక నీకు దయాగుణం ఉంది.

526
00:31:24,676 --> 00:31:26,845
ఇక ఆటల్లో గెలిచేందుకు
వాళ్లకి సాయపడుతున్నావు కదా.

527
00:31:28,555 --> 00:31:31,266
నువ్వు అచ్చం మా తాతగారిలాగే
నిట్టూర్చావు, చార్లీ బ్రౌన్.

528
00:31:34,311 --> 00:31:37,689
పీనట్స్ గ్యాంగ్ లో చేరిన
చిట్ట చివరి ప్రధాన పాత్రల్లో

529
00:31:37,773 --> 00:31:39,358
ఫ్రాంక్లిన్ ఆర్మ్ స్ట్రాంగ్ కూడా ఒకటి.

530
00:31:39,441 --> 00:31:42,736
అతను రంగ ప్రవేశం చేశాక, ఆ కామిక్స్
తీరునే అతను పూర్తిగా మార్చేశాడు.

531
00:31:43,445 --> 00:31:48,825
నేను ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు
పీనట్స్ లోకి ఫ్రాంక్లిన్ ప్రవేశించాడు.

532
00:31:48,909 --> 00:31:52,120
నేను చూసి, "వావ్"
ఒక నల్లజాతి పాత్ర ఉందే అనుకున్నా.

533
00:31:52,204 --> 00:31:53,372
తనొక నల్లజాతి కుర్రాడు.

534
00:31:53,455 --> 00:31:56,750
నేను కామిక్ స్ట్రిప్ చదువుతుంటే
అకస్మాత్తుగా నాలాగే ఉన్న

535
00:31:56,834 --> 00:31:57,835
ఒక కుర్రాడు కనిపించాడు.

536
00:31:58,919 --> 00:32:03,006
ఇప్పుడు ఇది పెద్ద విషయం
కాకపోవచ్చు, కానీ 1968లో,

537
00:32:03,090 --> 00:32:07,636
ఒక కామిక్ స్ట్రిప్ లో నల్లజాతి, తెల్లజాతి
పిల్లలు కలిసి ఆడుకోవడం చాలా పెద్ద విషయమే.

538
00:32:08,387 --> 00:32:12,140
తను ఫ్రాంక్లిన్ ను స్ట్రిప్ లోకి తెచ్చిన
సంవత్సరం అయిన 1968లో,

539
00:32:12,224 --> 00:32:16,019
డాక్టర్ కింగ్ దారుణ హత్యకు నిరసనగా
నగరాలన్నీ తగలబడుతున్నాయి.

540
00:32:16,603 --> 00:32:18,522
డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్,

541
00:32:18,605 --> 00:32:21,775
మానవ హక్కుల ఉద్యమంలో
అహింసా విధానానికి నాయకుడు,

542
00:32:21,859 --> 00:32:24,528
ఆయనను టెన్నెస్సీలోని మెంఫిస్
నగరంలో కాల్చి చంపారు.

543
00:32:24,611 --> 00:32:29,992
తర్వాత హారియట్ గ్లిక్మన్
అనే మహిళ స్పార్కీని సంప్రదించింది.

544
00:32:30,075 --> 00:32:34,663
"షుల్జ్, మీ కార్టూన్ల ద్వారా ఏదో ఒకటి
చేయడానికి ఇదే మంచి సందర్భం,"

545
00:32:34,746 --> 00:32:36,415
అని ఆమె అంది.

546
00:32:36,498 --> 00:32:42,254
"పీనట్స్ లో ఒక నల్లజాతి పిల్లాడ్ని
పాత్రను చేర్చండి," అని ఆమె కోరింది.

547
00:32:42,337 --> 00:32:46,049
అతనేమో, "నా వల్ల కాదు. నల్లజాతి పిల్లాడి
ప్రవర్తన ఎలా ఉంటుందో నాకు తెలీదు" అన్నాడు.

548
00:32:46,550 --> 00:32:50,512
కనుక, హారియట్ గ్లిక్మన్, నల్లవారైన తన
మిత్రులు కెన్నెత్ కెల్లీని,

549
00:32:50,596 --> 00:32:54,600
మోనికా గన్నింగ్ ని, ఇంకా తల్లిదండ్రులను
షుల్జ్ కు లేఖ రాయమని కోరింది.

550
00:32:55,267 --> 00:32:59,813
అప్పట్లో, కామిక్స్ లో
ఇతర వర్ణాల పిల్లల పాత్రలు ఉండేవి కావు,

551
00:32:59,897 --> 00:33:03,108
ఆ విషయంలో మార్పు తీసుకురాగలిగితే,

552
00:33:03,192 --> 00:33:05,152
పిల్లలకు మేలు కలుగుతుందని
స్పార్కీ గ్రహించాడు.

553
00:33:05,235 --> 00:33:08,572
వర్ణ వివక్షను ఎత్తి చూపించేలా
ఏదో ఒకటి చేయాలి అని

554
00:33:08,655 --> 00:33:10,157
అతను దృఢంగా అనుకున్నాడు.

555
00:33:10,240 --> 00:33:13,410
పక్షపాత రహితంగా ఆలోచించే
అతని మనస్తత్వాన్ని మీరు అర్థం చేసుకోవచ్చు.

556
00:33:13,493 --> 00:33:17,539
జాతుల మధ్య అసమానతలు
మంచివి కావనేది నా ఉద్దేశం.

557
00:33:17,623 --> 00:33:19,875
చాలాకాలం పాటు ఫ్రాంక్లిన్ ను
స్ట్రిప్ లో చేర్చకుండా

558
00:33:19,958 --> 00:33:23,045
నిలిపి ఉంచాను, ఎందుకంటే ఆ పాత్రను
సరిగ్గా రూపొందించలేననే భావన నాకు ఉండింది.

559
00:33:23,128 --> 00:33:23,962
దయచేసి, ఒకటివ్వండి

560
00:33:24,046 --> 00:33:26,924
ఊరికే నల్లజాతి వాళ్ళ మెప్పు కోసం
ఆ పాత్రను ప్రవేశపెట్టాలని నేను అనుకోలేదు.

561
00:33:27,007 --> 00:33:29,676
ఎలాంటి ఆర్భాటం లేకుండా
ప్రవేశ పెట్టాలని భావించాను.

562
00:33:29,760 --> 00:33:34,306
ఇద్దరు పిల్లలు బీచ్ లో కలిసి ఆడుకునే
సందర్భంలో నేను ఆ పాత్రను ప్రవేశపెట్టాను.

563
00:33:34,389 --> 00:33:37,643
ఇసుకలో కోటలు కట్టడం తమ
ఇద్దరికీ ఇష్టమని వాళ్లు గుర్తిస్తారు.

564
00:33:37,726 --> 00:33:40,270
తమలో ఒకరు నల్లజాతి, మరొకరు తెల్లజాతి
వారనే సంగతిని వాళ్ళు పట్టించుకోరు.

565
00:33:40,354 --> 00:33:42,439
"ఇప్పుడు చూడు, చార్లీ బ్రౌన్.

566
00:33:42,523 --> 00:33:44,858
ఇదిగో అసలైన ఇసుక కోట!"

567
00:33:44,942 --> 00:33:47,611
పత్రికలవాళ్లు స్ట్రిప్ ను
ప్రచురించబోమని బెదిరించారు.

568
00:33:47,694 --> 00:33:50,656
అతను "అలాగా, సరే ప్రచురించకండి," అని
జవాబిచ్చాడు. దాంతో వాళ్లు వెనక్కు తగ్గారు.

569
00:33:50,739 --> 00:33:53,700
తర్వాత వాళ్లు, "కనీసం, స్కూల్లోనైనా ఇద్దరూ
కలిసి ఉన్నట్టు చూపించొద్దు," అని అడిగారు.

570
00:33:53,784 --> 00:33:56,036
కానీ అతను దానికి పూర్తి భిన్నంగా చేశాడు.

571
00:33:56,119 --> 00:33:58,413
ఫ్రాంక్లిన్ లో ఆసక్తి గొలిపే
లక్షణం ఏమిటంటే,

572
00:33:58,497 --> 00:34:04,336
అతను ఎంత సీరియస్ గా అనిపించినా కానీ,
అతని వ్యక్తిత్వాన్ని అంతగా గమనించరు,

573
00:34:04,419 --> 00:34:08,422
తను చాలా సీరియస్ గా ఉండే కుర్రాడు
ఇప్పుడు పెద్దవాడిని అయ్యాక

574
00:34:08,507 --> 00:34:10,634
దాని గురించి తలచుకుంటే
నాకొకటి అనిపిస్తింది,

575
00:34:11,217 --> 00:34:16,306
అది శ్వేత జాతీయుల ప్రపంచంలో నల్లజాతి
పిల్లాడిగా మనుగడ సాగించడంలో ఉండే

576
00:34:16,389 --> 00:34:18,266
బాధ అంతా అతనిలో ప్రస్ఫుటం అవుతూ ఉంటుంది,

577
00:34:18,350 --> 00:34:20,143
ఇది ఒక కామిక్ స్ట్రిప్ అయినప్పటికీ కూడా.

578
00:34:20,226 --> 00:34:23,397
అందరూ తనను అదోలా చూస్తూ
ఉండటం అతనికి తెలుస్తూనే ఉంటుంది.

579
00:34:40,121 --> 00:34:44,543
బహుశా కుక్కకు తిండి పెట్టడమే
నా జీవిత లక్ష్యం కాబోలు.

580
00:34:49,089 --> 00:34:51,425
ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదు.

581
00:34:51,507 --> 00:34:52,885
ఇవాళే రాయడం మొదలుపెట్టాలి.

582
00:35:06,982 --> 00:35:08,734
ఒక కుక్కగా నా జీవితం

583
00:35:12,070 --> 00:35:16,950
అది ఒక గాఢాంధకారమైన,
వర్షం కురుస్తున్న రాత్రి...

584
00:35:24,708 --> 00:35:28,420
నేనెవర్ని? నేనెవర్ని?

585
00:35:31,507 --> 00:35:33,050
దీన్ని వల్ల లాభం లేదు.

586
00:35:33,133 --> 00:35:35,135
కాస్త గాలి కోసం నేను
అలా బయటకెళ్తే మంచిదేమో.

587
00:35:47,648 --> 00:35:49,691
"ఏ చార్లీ బ్రౌన్ క్రిస్మస్" పేరిట

588
00:35:49,775 --> 00:35:54,154
చార్లీ బ్రౌన్, ఇంకా అతని స్నేహితుల
టీవీలో ప్రదర్శితమవడం

589
00:35:54,238 --> 00:35:57,074
వారి జీవితంలో జరిగిన
ఒకానొక గొప్ప విషయం అని చెప్పవచ్చు.

590
00:35:57,157 --> 00:35:59,243
మా అమ్మ మా మొదటి కలర్ టీవీని,
నేను క్రిస్మస్ స్పెషల్ ని...

591
00:35:59,326 --> 00:36:00,953
డాన్ "టామ్ టుమారో" పెర్కిన్స్
కార్టూనిస్ట్, "దిస్ మోడర్న్ వరల్డ్"

592
00:36:01,036 --> 00:36:03,455
...రంగుల్లో చూడటానికని సరిగ్గా
ఆ సమయానికే కొనుగోలు చేసింది.

593
00:36:03,539 --> 00:36:05,707
అది నాకు చాలా గొప్ప విషయం.

594
00:36:05,791 --> 00:36:09,211
ప్రతి క్రిస్మస్ కూ, మేమందరం కలసి
వేడి కొకొవా తాగుతూ దాన్ని టీవీలో చూడటం

595
00:36:09,294 --> 00:36:11,088
భలే సరదాగా ఉండేది.

596
00:36:12,005 --> 00:36:15,509
వ్యక్తిగతంగా నేను క్రిస్మస్ జరుపుకోను.
నేను యూదుణ్ని. నాకు క్రిస్మస్ ఇష్టం ఉండదు.

597
00:36:15,592 --> 00:36:18,178
అదంటే నాకు గిట్టదు.
క్రిస్మస్ అంటే నాకు ఏమాత్రం గిట్టదు.

598
00:36:18,262 --> 00:36:23,183
కానీ చార్లీ బ్రౌన్ క్రిస్మస్ స్పెషల్...
దానికి మించింది ఏదైనా ఉంటుందా అసలు?

599
00:36:23,267 --> 00:36:25,978
చార్లీ బ్రౌన్ క్రిస్మస్
చాలా పెద్ద హిట్ అయింది,

600
00:36:26,061 --> 00:36:29,565
ఆ వెనువెంటనే ప్రతి సెలవు దినాన
"పీనట్స్" స్పెషల్ ప్రసారం మొదలైంది.

601
00:36:29,648 --> 00:36:32,359
నా చిన్నప్పుడు పండుగ సెలవలంటూ
ఏమీ ఉండేవి కావు.

602
00:36:32,442 --> 00:36:34,903
నా వృత్తిలో భాగంగా నేను నిరంతరం
ప్రయాణిస్తూ ఉండేదాన్ని.

603
00:36:34,987 --> 00:36:37,072
కాబట్టి నా వరకూ,

604
00:36:37,155 --> 00:36:41,660
"ఇవాళ సెలవు. అది ఈరోజు," అలా నా జీవితంలో

605
00:36:41,743 --> 00:36:44,329
ప్రత్యేకమైన రోజులేవీ లేవు.

606
00:36:44,913 --> 00:36:47,416
హలోవీన్ స్పెషల్,

607
00:36:47,499 --> 00:36:48,834
గ్రేట్ పంప్కిన్ స్పెషల్ వంటివి,

608
00:36:48,917 --> 00:36:51,628
ఇంకా ఎప్పుడు తలుచుకున్నా నవ్వు వచ్చే
"నీకు ఏం వచ్చింది?" నాకు గుర్తున్నాయి.

609
00:36:51,712 --> 00:36:55,048
"నాకు యాపిల్ వచ్చింది." "నాకు క్యాండీ
బార్ వచ్చింది." చార్లీ బ్రౌన్...

610
00:36:55,132 --> 00:36:57,134
నాకు రాయి వచ్చింది.

611
00:36:58,385 --> 00:37:01,013
సరే. మళ్లీ మొదలు పెడదాం.

612
00:37:06,351 --> 00:37:11,148
ఐదు, నాలుగు, మూడు, రెండు...
ఇంజన్లన్నీ ప్రారంభమయ్యాయి.

613
00:37:11,648 --> 00:37:14,484
పండుగ ప్రత్యేక ప్రసారాల వల్ల
"పీనట్స్" కు బాగా జనాదరణ లభించింది,

614
00:37:14,568 --> 00:37:19,573
దాంతో నాసా తన అపోలో 10 ఉపగ్రహ వాహనాలకు
చార్లీ బ్రౌన్, స్నూపీ పేర్లను పెట్టింది.

615
00:37:19,656 --> 00:37:22,993
మీ అంతరిక్ష యాత్రలో మమ్మల్ని కూడా
భాగస్వాముల్ని చేసినందుకు సంతోషం,

616
00:37:23,076 --> 00:37:24,453
అలాగే కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

617
00:37:24,536 --> 00:37:27,706
స్నూపీ చంద్రమండలానికి వెళ్లడం
వంటి వింత సంఘటనలు జరుగుతాయని

618
00:37:27,789 --> 00:37:29,833
నేను ఏనాడూ అనుకోలేదు.

619
00:37:29,917 --> 00:37:32,252
అలాగే. అలాంటిదే అక్కడ కూడా ఉంది.

620
00:37:34,129 --> 00:37:37,466
ఇది నా జీవితంలోనే
నన్ను కదిలించిన సంఘటనల్లో ఒకటి.

621
00:37:37,549 --> 00:37:38,967
చార్లీ బ్రౌన్ కు
ఘన స్వాగతం!

622
00:37:39,051 --> 00:37:42,429
వాళ్లు నీ పేరును
ఒక లూనర్ ల్యాండర్ కి పెట్టారంటే,

623
00:37:42,513 --> 00:37:44,806
ఆ సంస్కృతిలో
నీది విడదీయలేని భాగం అయ్యుండాలి.

624
00:37:44,890 --> 00:37:47,559
నేను ఏం అంటున్నానో అర్థమైందా?
అంతటి పేరు సంపాదించడమంటే ఊహించగలరా?

625
00:37:47,643 --> 00:37:49,686
అసలు ఊహించగలరా? అది మామూలు విషయం కాదు.

626
00:37:50,562 --> 00:37:54,066
చార్లీ బ్రౌన్, స్నూపీ
అంతరిక్ష ప్రయాణంలో ఉండగా,

627
00:37:54,149 --> 00:37:56,610
స్పార్కీ మాత్రం సాధారణ జీవితమే గడపసాగాడు.

628
00:37:57,110 --> 00:37:58,779
తన చుట్టూ తనదైన
ప్రపంచాన్ని నిర్మించుకున్నాడు

629
00:37:58,862 --> 00:38:01,949
అందులో చిన్నప్పుడు తను
ఇష్టపడినవన్నీ సమకూర్చుకున్నాడు,

630
00:38:02,533 --> 00:38:03,951
స్కేటింగ్ రింక్,

631
00:38:04,743 --> 00:38:06,245
బేస్ బాల్ మైదానం వంటివన్నమాట.

632
00:38:07,538 --> 00:38:10,499
తను స్టూడియోలో ఎన్నడూ పనిచేయలేదు.
అది ఒక క్యాంపస్. అది వేరే లోకం అన్నమాట.

633
00:38:10,582 --> 00:38:13,961
ఈ భవంతిలో ఒక కెఫే ఉంది,
ఒక హాకీ మైదానం ఉంది.

634
00:38:15,462 --> 00:38:19,383
రోజూ కాలకృత్యాలు తీర్చుకుని
ఐస్ ఎరీనాకు వెళ్లడం,

635
00:38:19,466 --> 00:38:22,344
అక్కడ అల్పాహారం తీసుకుని స్టూడియోకి
వెళ్లడం వంటి నా దినచర్య నాకెంతో ఇష్టమైనది.

636
00:38:22,427 --> 00:38:23,804
ఇక ఆ విషయానికి వస్తే,

637
00:38:23,887 --> 00:38:26,974
ఇంకే పనులూ చేయకుండా తీరిగ్గా కూర్చుని
బొమ్మలు గీసుకుంటాను.

638
00:38:27,683 --> 00:38:30,769
అతను పొద్దున్నే నిద్ర లేచి,
కారులో దిగువకు వెళ్తాడు,

639
00:38:30,853 --> 00:38:33,397
వీధిలో రోజూ ఎప్పటిలాగే అదే చోట
కార్ పార్క్ చేస్తాడు.

640
00:38:33,480 --> 00:38:35,566
ఐస్ ఎరీనాలోకి
వెళ్లి అల్పాహారం తీసుకుంటాడు.

641
00:38:35,649 --> 00:38:38,026
అది కూడా ఇంగ్లీష్ మఫిన్, ద్రాక్ష రసం.

642
00:38:38,110 --> 00:38:42,197
తర్వాత ఆఫీసుకు చేరుకుని, తన
డెస్క్ ముందు కూర్చుని, పనిలో పడతాడు.

643
00:38:42,281 --> 00:38:46,785
తన ఆఫీసులోకి వెళ్లి, ఏదైనా బొమ్మ గీసేందుకు
స్ఫూర్తినిచ్చే అంశం కోసం వేచి చూస్తాడు.

644
00:38:48,245 --> 00:38:50,831
తను పని చేయని రోజంటూ లేదు.

645
00:38:50,914 --> 00:38:53,709
మేం ఎప్పుడు వెళ్లినా, తను
స్టూడియోలోనే ఉండేవాడు.

646
00:38:53,792 --> 00:38:56,128
పని చేసుకుంటూనే ఉండేవాడు.
పని అంటే అతనికి అంత ఇష్టం.

647
00:38:56,211 --> 00:39:01,800
స్టూడియోలో ఏకాంతంగా కూర్చుని,
బొమ్మలు గీస్తూ ఉండేవాడు.

648
00:39:01,884 --> 00:39:06,013
గదిలో అన్నేసి గంటలు ఒంటరిగా ఉండగలగడానికి,
అలాగే గంటల తరబడి ఆలోచనలలో మునిగిపోవడానికి,

649
00:39:06,096 --> 00:39:11,560
చాలా ఒంటరిగా ఉండగలిగే స్వభావం ఉండాలి.

650
00:39:12,769 --> 00:39:18,400
అతను అంత విజయవంతం అయినా కూడా, అతని పట్ల,

651
00:39:18,483 --> 00:39:24,573
అలాగే ఆ పాత్రల పట్ల జనాలలో
అంత ప్రేమ, అంకితభావం చూస్తే

652
00:39:24,656 --> 00:39:27,451
ఓ పట్టాన నమ్మబుద్ధి కాదు.

653
00:39:36,627 --> 00:39:40,964
ఈ నక్షత్రాలను అలా చూస్తూ ఉంటే,
నీ జీవితం అల్పమైనదని అనిపించడం లేదా,

654
00:39:41,048 --> 00:39:42,257
చార్లీ బ్రౌన్?

655
00:39:42,758 --> 00:39:45,093
నాకు ఎప్పూడూ నా జీవితం
అల్పమైనదనే అనిపిస్తుంది, లైనస్.

656
00:39:48,263 --> 00:39:50,516
నీ వ్యాసం సంగతి ఎంతవరకూ వచ్చింది?

657
00:39:50,599 --> 00:39:52,643
ఒక్క పదం కూడా రాయలేదు.

658
00:39:53,435 --> 00:39:55,604
బహుశా నాలో ప్రత్యేకత ఏమీ లేదేమో.

659
00:39:55,687 --> 00:39:58,190
నీలో ప్రత్యేకత ఏదీ లేదని
నేను అనుకోవడం లేదు, చార్లీ బ్రౌన్.

660
00:39:58,273 --> 00:39:59,399
ధన్యవాదాలు, లైనస్.

661
00:40:00,025 --> 00:40:04,613
కానీ నేనిప్పుడేం చేయాలి?
వ్యాసం రాసేందుకు గడువు రేపే.

662
00:40:05,113 --> 00:40:07,449
నాకు ఏమీ అర్థం కానప్పుడు,

663
00:40:07,533 --> 00:40:10,619
కొన్నిసార్లు ఆకాశంవైపు చూస్తే
నాకు సమాధానాలు దొరుకుతాయి.

664
00:40:16,375 --> 00:40:18,043
అదేం పని చేయడం లేదు, లైనస్.

665
00:40:18,544 --> 00:40:20,003
ఏం చూశావు నువ్వు?

666
00:40:20,087 --> 00:40:22,381
లెక్కలేనని నక్షత్రాలని అనుకుంటా.

667
00:40:22,464 --> 00:40:25,801
కానీ వాటికీ, నా వ్యాసానికి ఏంటి సంబంధం?

668
00:40:25,884 --> 00:40:29,096
ఒక విధంగా, ఆ నక్షత్రాలు కూడా
నీలాంటివే అన్నమాట.

669
00:40:31,723 --> 00:40:35,686
నువ్వు కాస్త నిశితంగా చూస్తే,
ప్రతి నక్షత్రమూ భిన్నంగా కనిపిస్తుంది.

670
00:40:35,769 --> 00:40:40,315
రంగు, ఆకారం, మెరుపులో
ఒక్కొక్కటీ ఒక్కొక్క రకంగా ఉంటాయి.

671
00:40:40,399 --> 00:40:43,569
విభిన్నమైన ఆ లక్షణాల వల్లనే అవి అంత
అందంగా కనిపిస్తాయి.

672
00:40:45,320 --> 00:40:46,780
మనలాగే, చార్లీ బ్రౌన్.

673
00:40:47,489 --> 00:40:48,782
మనం ఒక్కొక్కొరం ఒక్కో తరహాలో ఉంటాం,

674
00:40:48,866 --> 00:40:51,827
కానీ మనకన్నా గొప్పదానిలో
మనం భాగంగా ఉన్నాం.

675
00:40:51,910 --> 00:40:53,662
మన జీవితానికొక లక్ష్యం ఉంది,

676
00:40:53,745 --> 00:40:56,707
అది తెలుసుకోవడం కష్టమైనా, అదే నిజం.

677
00:40:56,790 --> 00:41:00,752
ప్రతి రోజూ ఆ అన్వేషణలో గడపడంలో
ఎంతో సంతోషం దాగి ఉంది.

678
00:41:00,836 --> 00:41:05,132
ప్రస్తుతానికి, నీ లక్ష్యం
చార్లీ బ్రౌన్ లాగ ఉండటమే కావచ్చు.

679
00:41:08,177 --> 00:41:12,181
నువ్వు చెప్పింది నిజమే కావచ్చు, లైనస్.
సరే, నేను వెళ్లి వ్యాసం రాసుకోవాలి.

680
00:41:14,057 --> 00:41:17,769
చార్లీ బ్రౌన్ లో ఆశ చిగురిస్తే,
మనందరిలోనూ ఆశ చిగురించినట్లే.

681
00:41:23,358 --> 00:41:24,776
1980 నాటికి,

682
00:41:24,860 --> 00:41:29,656
స్పార్కీ 30 ఏళ్లుగా దాదాపు ప్రతీ రోజూ
పీనట్స్ గీస్తున్నాడు.

683
00:41:30,157 --> 00:41:32,784
సుమారు 10,000 స్ట్రిప్పులకు పైగా గీశాడు.

684
00:41:33,410 --> 00:41:34,494
ఇన్నేళ్లలోనూ,

685
00:41:34,578 --> 00:41:38,582
ఒక్క రోజైనా సెలవు తీసుకోలేదు
ఒక్క రోజు కూడా గడువును అతిక్రమించలేదు.

686
00:41:38,665 --> 00:41:42,628
రోజూ పంజరంలోంచి బయటకొచ్చి, తిరిగి
లోపలకు వెళ్లే ఉడతలాంటి వాడివి నువ్వు.

687
00:41:42,711 --> 00:41:43,879
సెలవలంటూ ఏమీ ఉండవు.

688
00:41:43,962 --> 00:41:47,633
కామిక్ స్ట్రిప్ అనేది వినోదాన్ని పంచే
ఒక విలక్షణమైన సాధనం.

689
00:41:47,716 --> 00:41:50,969
ప్రతి రోజూ అది నీతోనే జీవిస్తుంది.

690
00:41:51,053 --> 00:41:56,266
ఆ విధంగా చూస్తే, రాసింది రాయకుండా,
గీసింది గీయకుండా

691
00:41:56,350 --> 00:41:58,018
రోజూ ఒక యంత్రంలా పనిచేయాల్సిందే.

692
00:41:58,810 --> 00:42:01,271
చాలామంది కార్టూనిస్టులు
పెన్సిల్ తో బొమ్మలు గీసి,

693
00:42:01,355 --> 00:42:03,065
ఇంకు దిద్దే పని వేరేవాళ్లకి
అప్పజెప్పుతారు.

694
00:42:04,191 --> 00:42:07,653
కానీ అతను తనే ఇంకుతో దిద్దేవాడు.

695
00:42:07,736 --> 00:42:11,240
తన బొమ్మను తాను తప్ప మరొకరు
తాకకూడదన్న భావన ఉండేది అతనికి.

696
00:42:11,323 --> 00:42:13,116
పని యావత్తూ తనే చేసుకునేవాడు.

697
00:42:13,700 --> 00:42:18,539
1981 జూలైలో,
స్పార్కీకి ఛాతి నొప్పులు మొదలయ్యాయి.

698
00:42:18,622 --> 00:42:21,333
గుండెకు శస్త్ర చికిత్స చేయించేందుకు
అతన్ని హుటాహుటిన ఆస్పత్రిలో చేర్చారు.

699
00:42:21,416 --> 00:42:22,918
అతను ఆస్పత్రిలో ఉన్నాడు.

700
00:42:23,001 --> 00:42:26,463
తను బొమ్మ వేయగలడో లేదో చూడటానికి
ఒక కాగితం ఇమ్మని అడిగాడు.

701
00:42:26,547 --> 00:42:31,301
తను గీయగలడో లేదో నిర్ధారించుకోవడానికి
ఆ పనిని వెంటనే చేయాలనుకున్నాడు.

702
00:42:31,385 --> 00:42:33,887
చివరకు బొమ్మ గీయగలిగాడు, కానీ
దాని స్వరూపం కాస్త మారింది.

703
00:42:38,016 --> 00:42:40,853
అతని చేయి వణకడం
మొదలైంది, గీతలూ వంకర టింకరగా వచ్చాయి.

704
00:42:41,645 --> 00:42:44,857
ఆ తర్వాత వచ్చిన స్ట్రిప్పుల్లో,

705
00:42:44,940 --> 00:42:47,734
గీతల కొసలు వంకర్లు పోవడం మీరు గమనించవచ్చు.

706
00:42:48,235 --> 00:42:51,238
"నా చేయి అప్పుడప్పుడు బాగా వణుకుతోంది,
దాన్ని మరో చేతితో

707
00:42:51,321 --> 00:42:53,991
పట్టుకుని బొమ్మ గీయాల్సి
వస్తోంది," అనేవాడు.

708
00:42:54,074 --> 00:42:58,078
అతను చార్లీ బ్రౌన్ పాత్రను
గీస్తుండగా నేను చూడటం నాకు గుర్తుంది,

709
00:42:58,161 --> 00:43:00,038
ఆ పాత్ర తల పెద్దగా, గుండ్రంగా ఉంటుంది.

710
00:43:00,122 --> 00:43:02,791
అతని చేతులు వణికేవి, దాంతో
అతనికి చాలా కోపం వచ్చేది.

711
00:43:02,875 --> 00:43:07,713
అయినా కూడా "వర్షం పడుతున్నట్టు గీయగలను"
అంటూ వర్షం పడుతున్నట్టు లేదా

712
00:43:07,796 --> 00:43:09,882
గడ్డి మొలుస్తున్నట్టు చిన్నపాటి
గీతలు గీసేవాడు.

713
00:43:11,133 --> 00:43:15,679
"చూడు ఎలా ఉందో. నేనింకా గీయగలను
అనడానికి ఈ బొమ్మే ఉదాహరణ," అనేవాడు.

714
00:43:15,762 --> 00:43:20,100
వణుకుతూ అతను గీసిన గీతలు
అతని ప్రత్యేకతలుగా మారాయి.

715
00:43:21,268 --> 00:43:25,147
అంటే, అది చాలా బాగుంది. అది చాలా మంది
వృత్తి జీవితాలను నాశనం చేసుండేది.

716
00:43:25,230 --> 00:43:28,692
కానీ పీనట్స్ ను ఇది
మరొక స్థాయికి తీసుకెళ్లింది,

717
00:43:28,775 --> 00:43:35,282
అతనిపైనా, అతని పాత్రలపైనా మనలో
సానుభూతిని మరింత పెంచేందుకు దోహద పడింది.

718
00:43:36,283 --> 00:43:40,662
ఇంకా కష్టపడేందుకు తాను సిద్ధమన్న
అతని నైజాన్ని ఆ బొమ్మలు చెప్పకనే చెప్పేవి.

719
00:43:41,246 --> 00:43:43,332
అతను బొమ్మలు గీయడం ఆపలేదు. అతనిలోని అహం,

720
00:43:43,415 --> 00:43:46,001
" నేను దాన్ని సరిగ్గా గీయలేకపోతే,
ఇక దాన్ని గీయను," అనేందుకు అంగీకరించలేదు.

721
00:43:46,084 --> 00:43:49,129
అదే అతని తత్వం. తన అభిప్రాయాల్ని
బొమ్మల రూపంలో చెప్పాడు.

722
00:43:49,213 --> 00:43:50,506
అతను అలాగే జీవించాడు.

723
00:43:51,882 --> 00:43:54,968
అప్పుడప్పుడూ కొన్ని పరిష్కారాలు
చూపానని నేను అనుకుంటూ ఉంటాను.

724
00:43:55,052 --> 00:43:56,053
వద్దు!

725
00:43:56,136 --> 00:44:01,642
వాటిలో ఒకటి ఏంటంటే, చార్లీ బ్రౌన్ మాదిరిగా
నిరంతరం ప్రయత్నిస్తూ ఉండటమే.

726
00:44:04,311 --> 00:44:07,814
తను ఎన్నటికీ విరమించడు. విరమించాల్సిన
వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే, అది అతనే.

727
00:44:20,202 --> 00:44:23,914
శుభోదయం, చార్లీ బ్రౌన్.
వ్యాసం ఎంతవరకూ రాశావు?

728
00:44:23,997 --> 00:44:27,084
రాత్రంతా మేలుకుని,
మొత్తానికి పూర్తి చేశాను.

729
00:44:27,167 --> 00:44:30,546
-బహుశా నాకు ఏ గ్రేడ్ రావచ్చు.
-అది చాలా మంచి విషయం.

730
00:44:30,629 --> 00:44:33,006
కానీ జీవితంలో మనకు దక్కే విజయాలు

731
00:44:33,090 --> 00:44:35,008
అసాంప్రదాయకమైన రీతిలోనే కలుగుతాయి.

732
00:44:35,092 --> 00:44:38,011
నీ మాటలు నాకు అర్థం కావట్లేదు, లైనస్.

733
00:44:38,095 --> 00:44:41,807
కానీ నాకు ఏ గ్రేడ్ వస్తే, అది తప్పకుండా
అసాంప్రదాయకమైనదే అవుతుంది.

734
00:44:55,612 --> 00:44:59,408
మన వ్యాసాలకు గ్రేడ్లు ఇచ్చారు. కనీసం
దీనికి అయినా నాకు ఏ గ్రేడ్ వచ్చిందో లేదో.

735
00:45:03,370 --> 00:45:05,372
నేను ఇక ఈ ఉత్కంఠ భరించలేను.

736
00:45:07,916 --> 00:45:11,086
సీ మైనస్ గ్రేడా? దేవుడా.

737
00:45:11,837 --> 00:45:13,005
నాకు ఏ గ్రేడ్ వచ్చింది.

738
00:45:13,088 --> 00:45:16,550
నేను రాసిన విధానం బాగుందని
టీచర్ మెచ్చుకుంది కూడా.

739
00:45:23,223 --> 00:45:27,978
నేను నమ్మలేక పోతున్నాను, లైనస్.
ఇంతా చేసి సీ మైనస్ గ్రేడ్ వచ్చింది.

740
00:45:28,061 --> 00:45:32,232
బాధపడకు, చార్లీ బ్రౌన్. ఒకరిని విలువ
కట్టేందుకు ఈ గ్రేడ్లు కొలమానం కాదు.

741
00:45:32,316 --> 00:45:36,486
ఏదేమైనా, ఒక మంచి పనికి విలువకట్టాలంటే
అది కాలక్రమేణా జరగాల్సిందే.

742
00:45:36,987 --> 00:45:40,073
ఆ ఆశతోనైనా మనం ముందుకు సాగాలనుకుంటా.

743
00:45:44,953 --> 00:45:48,665
"కొన్నిసార్లు రాత్రిళ్లు మేలుకుని
"నాకే ఎందుకిలా?" అని ప్రశ్నించుకుంటా,

744
00:45:49,750 --> 00:45:53,504
దానికి "ప్రత్యేకమేం లేదు. నీకు అలా పేరు
వచ్చిందంతే," అనే సమాధానం వినబడుతుంది.

745
00:45:59,927 --> 00:46:03,263
పేగు సంబంధిత కాన్సర్ కు చికిత్స
చేయించుకునేందుకు వీలుగా కార్టూన్లు

746
00:46:03,347 --> 00:46:06,141
వేయడం నుంచి రిటైర్ అవుతున్నట్టు కొన్ని
వారాల క్రితం చార్లెస్ షుల్జ్ ప్రకటించాడు.

747
00:46:06,225 --> 00:46:07,059
జనవరి 3, 2000

748
00:46:08,435 --> 00:46:14,274
కెమోథెరపీ వల్ల నీరసించి,
తను రిటైర్ కావాలని నిర్ణయించుకున్నాడు.

749
00:46:14,358 --> 00:46:19,363
"నేనిక స్ట్రిప్ గీయలేను," అని తను అనడం
నాకు బాగా గుర్తుంది.

750
00:46:19,905 --> 00:46:24,284
ఒక రోజు తను వచ్చాడు, ఆఖరి
స్ట్రిప్ చేయడం గురించి మాట్లాడుకుంటున్నాం.

751
00:46:24,368 --> 00:46:26,745
అతను నాకు కొన్ని అడుగుల దూరంలో
కూర్చుని ఉన్నాడు,

752
00:46:26,828 --> 00:46:29,373
తను నావైపు చూసి, తనదైన ధోరణిలో నవ్వి,

753
00:46:29,456 --> 00:46:31,458
"నేను నిజంగానే
కొన్ని సరదా బొమ్మలు గీశాను," అన్నాడు.

754
00:46:31,542 --> 00:46:35,003
ఇకపై బొమ్మలు గీయలేనన్న బాధ

755
00:46:35,087 --> 00:46:37,840
అతని మాటల్లో ధ్వనించడం
స్పష్టంగా తెలుస్తుంది.

756
00:46:38,757 --> 00:46:41,760
అతని చివరి రోజువారీ స్ట్రిప్
జనవరి 3న విడుదల అవుతుంది,

757
00:46:41,844 --> 00:46:43,470
అదే రోజున ఈ కథనం ప్రసారమవుతుంది.

758
00:46:43,554 --> 00:46:47,474
ఇకపై బొమ్మలు గీయలేననే విషయాన్ని
మీరు పూర్తిగా జీర్ణించుకున్నారా?

759
00:46:48,016 --> 00:46:54,147
నేను "ఇక సెలవు, మిత్రులారా," లాంటిదేదో
రాసేదాకా...

760
00:46:54,231 --> 00:46:55,065
ప్రియమైన స్నేహితులారా...

761
00:46:55,148 --> 00:46:58,068
నేను దాన్ని జీర్ణించుకోలేదు అనే చెప్పాలి.

762
00:46:58,151 --> 00:47:04,241
ఆ తర్వాత చివరన, నేను
తన పేరును, నా పేరును రాశాను.

763
00:47:04,324 --> 00:47:06,076
ఆ తర్వాత...

764
00:47:06,159 --> 00:47:07,870
నేను ఏడవడం మొదలు పెడతానేమో.

765
00:47:09,371 --> 00:47:10,414
చివర్లో ఏం రాశానంటే...

766
00:47:10,497 --> 00:47:11,915
చార్లీ బ్రౌన్, స్నూపీ,
లైనస్, లూసీ...

767
00:47:11,999 --> 00:47:13,208
వీళ్లందరినీ ఎలా మరచిపోగలను...

768
00:47:13,292 --> 00:47:15,294
...చార్లీ బ్రౌన్, లైనస్ ఇలా పేరు పేరునా.

769
00:47:15,377 --> 00:47:16,920
అకస్మాత్తుగా, నాకు ఒకటి గుర్తు వచ్చింది...

770
00:47:18,297 --> 00:47:22,467
"పాపం ఆ అమాయకుడు. కనీసం ఒక్కసారైనా
ఫుట్ బాల్ ని తన్నలేకపోయాడే."

771
00:47:26,972 --> 00:47:30,517
2000 ఫిబ్రవరి 12న స్పార్కీ కన్నుమూశాడు.

772
00:47:31,018 --> 00:47:32,728
అదే రోజున,

773
00:47:32,811 --> 00:47:35,939
అతను గీసిన చివరి కామిక్ స్ట్రిప్
ప్రచురితమైంది.

774
00:47:36,023 --> 00:47:37,441
తను చనిపోయిన రోజున...

775
00:47:37,941 --> 00:47:39,151
లేదు, తను రాస్తున్నాడు అనుకుంటా..

776
00:47:39,234 --> 00:47:41,445
...అతని చివరి స్ట్రిప్ ప్రచురితమైంది.

777
00:47:41,528 --> 00:47:46,283
అందులో తన అంతరాత్మ, తాను సృష్టించిన
ఈ పాత్రల అంతరాత్మలతో

778
00:47:46,366 --> 00:47:49,745
ఎంతలా మమేకమైపోయుందే అనేది
వర్ణించబడి ఉందనుకుంటా.

779
00:47:49,828 --> 00:47:52,039
నా ఉద్దేశం, ఆ పాత్రలన్నీ అతనే.

780
00:47:52,122 --> 00:47:56,251
తనకు నచ్చిన పని చేస్తూ కన్నుమూశాడు.
ఇది ఎంతో గొప్ప విషయం.

781
00:47:56,335 --> 00:48:02,382
తన వ్యక్తిగత కథను రోజూ
విడమరచి చెప్పిన వ్యక్తి అతను.

782
00:48:02,466 --> 00:48:07,387
తన అభిమానులకు ఆ సంగతి అర్థమయ్యే
ఉంటుంది. వాళ్లకి అది తెలిసే ఉంటుంది.

783
00:48:07,471 --> 00:48:11,391
ఈ సరదా గొలిపే, గుర్తుండిపోయే,
అద్భుతమైన కామిక్ స్ట్రిప్పులు.

784
00:48:11,475 --> 00:48:14,394
వాటిని ఎంతో ఇష్టంతో ఆస్వాదించడంతోపాటు,

785
00:48:14,478 --> 00:48:17,397
వాటిలోంచి జీవిత పాఠాలను కూడా
నేర్చుకోవచ్చు.

786
00:48:17,481 --> 00:48:21,109
అసలైన మానవత్వానికి ఇవి మచ్చుతునకలు.

787
00:48:21,193 --> 00:48:24,112
మూర్తీభవించిన మానవత్వానికీ,
అమాయకత్వానికీ ఆ పాత్రలు ప్రతీకలు.

788
00:48:24,196 --> 00:48:26,573
క్రూరత్వం లేని మానవత్వానికి
అవన్నీ మచ్చుతునకలు.

789
00:48:27,366 --> 00:48:30,077
నేటి ప్రపంచానికి కావలసినవి ఇవే.

790
00:48:31,119 --> 00:48:32,746
మనం ఒకరితో ఒకరు ఏకీభవించకపోవచ్చు.

791
00:48:32,829 --> 00:48:34,998
లూసీ లాగా మనం గగ్గోలు పెట్టే రకం కావచ్చు.

792
00:48:35,082 --> 00:48:38,460
చార్లీ బ్రౌన్ మాదిరిగా
మనలోనూ అభద్రతాభావం ఉండవచ్చు.

793
00:48:38,544 --> 00:48:41,964
లైనస్ లాగ మన తాత్విక చింతనే
మనకు ముఖ్యమని మనం అనుకోవచ్చు.

794
00:48:42,047 --> 00:48:44,341
కానీ వాస్తవం ఏమిటంటే,
మనమంతా కనెక్ట్ అయ్యి ఉన్నాం.

795
00:48:44,424 --> 00:48:47,803
ఆ చిన్నారుల పాత్రల మధ్య నడిచే సంభాషణలు

796
00:48:47,886 --> 00:48:50,472
మన లోలోతుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి.

797
00:48:56,770 --> 00:48:59,648
చార్లెస్ షుల్జ్,
తన చిట్ట చివరి పీనట్స్ గీసిన

798
00:48:59,731 --> 00:49:01,149
ఇరవై ఏళ్ల తర్వాత కూడా,

799
00:49:01,233 --> 00:49:03,485
అతను జీవం పోసిన పాత్రలు

800
00:49:03,569 --> 00:49:06,947
ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా
ఆదరణ పొందుతూనే ఉన్నాయి.

801
00:49:07,030 --> 00:49:09,074
టామ్ సాయెర్, హక్ ఫిన్ లాగ,

802
00:49:09,157 --> 00:49:13,662
పీనట్స్ కూడా అమెరికన్ పాప్
సంస్కృతిలో ఒక భాగమైపోయింది.

803
00:49:13,745 --> 00:49:17,040
అందులోని మానవత్వపు భావోద్రేకాలు ఇప్పటికీ
ప్రతిధ్వనిస్తూ ఉండటం విశేషం.

804
00:49:17,624 --> 00:49:19,293
అది మాత్రం ఎప్పటికీ మారదు.

805
00:49:19,376 --> 00:49:20,878
అది సరూపమైనదీ, నిత్యమైనదీ,

806
00:49:20,961 --> 00:49:25,340
ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆ పాత్రల్లో
తమను తాము చూసుకుని, ఆస్వాదించవచ్చు.

807
00:49:26,049 --> 00:49:28,969
నా మనవళ్ళు పీనట్స్ ను చదవబోతున్నారు.

808
00:49:29,052 --> 00:49:30,179
ఇతను చార్లీ బ్రౌన్.

809
00:49:30,262 --> 00:49:33,724
దాదాపు 50 ఏళ్లుగా పీనట్స్ ను
చదువుతున్నవారికి మీరు

810
00:49:33,807 --> 00:49:35,809
చెప్పేది ఏమైనా ఉందా?

811
00:49:35,893 --> 00:49:42,524
నేను... గీసిన బొమ్మల్ని వారు
ఇష్టపడటం ఎంతో గొప్ప విషయం.

812
00:49:43,358 --> 00:49:45,986
నేను చేయగలిగింది నేను చేశాను.

813
00:50:11,929 --> 00:50:15,682
ఎక్కడికి వెళ్లావు, చక్?
నీ స్కేట్లు తెచ్చుకో.

814
00:50:39,331 --> 00:50:41,124
నిన్ను కలిసినందుకు సంతోషం, చార్లీ బ్రౌన్.

815
00:50:43,252 --> 00:50:46,004
త్వరగా, చార్లీ బ్రౌన్. స్కేట్లు వేసుకో.

816
00:50:53,345 --> 00:50:56,723
ఏడాదిలో తొలిరోజు కురిసే
మంచు కంటే ఆహ్లాదమైనది మరొకటి ఉండదు.

817
00:51:16,243 --> 00:51:17,870
పీనట్స్ సృష్టికర్త
చార్లెస్ ఎమ్. షుల్జ్

818
00:54:20,802 --> 00:54:24,014
ధన్యవాదాలు, స్పార్కీ.
మీరు సదా మా హృదయాలలో ఉంటారు.

819
00:54:24,097 --> 00:54:26,099
ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య



